
●35 ఏళ్లు వచ్చినా పసిపాపలా..
సింగరేణి(కొత్తగూడెం): 35 ఏళ్లు వచ్చిన బిడ్డను పసిపాపలా సాకుతోంది. దివ్యాంగురాలైన కూతురిని అన్నీ తానై పోషించుకుంటోంది. కొత్తగూడెం మధురబస్తీలో రైల్వే రిటైర్డ్ ఉద్యోగి పిండి జయరామ్, రాజమణెమ్మలకు నలుగురు కూతుళ్లు. ఇద్దరు సంపూర్ణ ఆర్యోగంతో జన్మించగా వారికి వివాహాలు చేశారు. మరో ఇద్దరు దివ్యాంగులు కిరణ్మయి, ప్రణతి. వ్యక్తిగత పనులు కూడా చేసుకోలేరు. వాష్‌రూమ్‌కు వెళ్లాలన్నా తల్లితోడు అవసరం. ఇద్దరిని తల్లి రాజమణెమ్మ కంటికి రెప్పలా కాపాడింది. 2017లో కిరణ్మయి మృతి చెందింది. ప్రణతికి ప్రస్తుతం 35 ఏళ్లు. దివ్యాంగురాలు కావడంతో తల్లే అన్ని పనులు చేస్తోంది.