
●కష్టాలను ఎదురొడ్డి.. పిల్లలను తీర్చిదిద్ది..
బోనకల్: మండలంలోని ముష్టికుంట్లకు చెందిన చిట్టా అరుణకు ఇద్దరు కుమార్తెలు. 2006లో భర్త సీతారామిరెడ్డి మృతి చెందాడు. కూలి పనులు చేస్తూ జీవనం పోరాటం ప్రారంభించింది. ఓపెన్ స్కూల్ ద్వారా 10వ తరగతి పూర్తి చేసింది. 2011లో కస్తూర్బాగాంధీ పాఠశాలలో ఔట్‌సోర్సింగ్ విధానంలో నైట్ వాచ్‌వుమన్‌గా చేరింది. జీతం సరిపోక రాత్రి నైట్ వాచ్‌వుమెన్‌గా పనిచేస్తూ ఉదయం కూలి పనులకు వెళ్లింది. తల్లి కష్టాన్ని గమనించిన పిల్లలు గ్రీష్మా, సుష్మా ఉన్నత చదువులు పూర్తి చేశారు. గ్రీష్మా ఫిషరీస్ డిపార్ట్‌మెంట్‌లో, సుష్మా ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తోంది. భర్త చనిపోయినా అధైర్య పడకుండా ఇద్దరు కూతుళ్లను ఉన్నత చదువులు చదివించి అరుణ పలువురికి ఆదర్శంగా నిలిచింది.