
మధిర పోలీసుస్టేషన్ అప్‌గ్రేడ్
మధిర: ఇన్నాళ్లు ఎస్సై స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా కొనసాగుతున్న మధిర పట్టణ పోలీసుస్టేషన్‌ను అప్‌గ్రేడ్ చేశారు. ఇందులో భాగంగా పోలీసుస్టేషన్‌కు సీఐ స్థాయి అధికారిని ఎస్‌హెచ్‌ఓగా నియమించారు. ఈమేరకు ఎస్‌హెచ్‌ఓగా డి.రమేష్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. దీంతో ప్రస్తుతం ఇక్కడ సీఐగా ఉన్న డి.మధు మధిర రూరల్, ఎర్రుపాలెం, బోనకల్ పోలీస్ స్టేషన్లకు సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా వ్యవహరించనున్నారు.
త్వరలోనే సబ్‌డివిజన్
మధిర సర్కిల్‌ను త్వరలోనే సబ్ డివిజన్‌గా మార్చనున్నట్లు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల సరిహద్దుగా ఉండడంతో శాంతిభద్రతల దృష్ట్యా ప్రత్యేక సబ్ డివిజన్ ఏర్పాటుచేయాలనే ప్రతిపాదన చాన్నాళ్లుగా ఉంది. ప్రస్తుతం టౌన్ పీఎస్ ఎస్‌హెచ్‌ఓగా సీఐను నియమించారు. దీంతో మధిర కేంద్రంగా ఇద్దరు సీఐలు విధులు నిర్వర్తించనున్నారు. ఇక మధిర పోలీస్ సర్కిల్ పరిధిని త్వరలోనే సబ్ డివిజన్ స్థాయికి అప్‌గ్రేడ్ చేయనున్నట్లు అధికారిక వర్గాల ద్వారా తెలిసింది.
ఎస్‌హెచ్‌ఓ స్థాయికి చేరిన టౌన్ పీఎస్