
పగటి పూట మూడు ఏసీ బస్సులు
సత్తుపల్లిటౌన్: వేసవి దృష్ట్యా సత్తుపల్లి నుంచి హైదరాబాద్‌కు పగటి పూట మూడు రాజధాని ఏసీ బస్సులు నడిపిస్తున్నామని ఆర్టీసీ ఖమ్మం డిప్యూటీ రీజనల్ మేనేజర్ మల్లయ్య తెలిపా రు. ఈ బస్సులను ప్రయాణికులు సద్విని యో గం చేసుకోవాలని సూచించారు. సత్తుపల్లి బస్టాండ్‌ను సందర్శించిన ఆయన డిపోలో రికార్డుల తనిఖీ అనంతరం మాట్లాడారు. ప్రయాణికుల కోసం అన్ని బస్టాండ్లలో చల్లని తాగునీరు అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. అలాగే, పాల్వంచ, కొత్తగూడెం, అన్నపురెడ్డిపల్లి ప్రయాణికుల కోసం సత్తుపల్లి బస్టాండ్‌లో అదనపు ప్లాట్‌ఫాంపై షెడ్ ఏర్పా టు చేశామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ యు.రాజ్యలక్ష్మి, మెకానికల్ ఇంజనీర్ ఎస్.సాహితీ, అసిస్టెంట్ మేనేజర్ విజయశ్రీ, ఉద్యోగులు పాల్గొన్నారు.
చెల్లని చెక్కు కేసులో
ఆరు నెలల జైలుశిక్ష
ఖమ్మం లీగల్: అప్పు తీసుకున్న వ్యక్తి జారీ చేసిన చెక్కు చెల్లకపోవడంతో ఆరు నెలల జైలుశిక్ష విధిస్తూ ఖమ్మం రెండో అదనపు ప్రధమ శ్రేణి కోర్టు న్యాయాధికారి ఏపూరి బిందుప్రియ గురువారం తీర్పు చెప్పారు. ఖమ్మం రోటరీనగర్‌కు చెందిన ధనావత్ గోవింద్ వద్ద శ్రీనగర్ కాలనీకి చెందిన నెల్లూరు సతీష్ రెండు సార్లు రూ.లక్ష చొప్పున 2018లో అప్పు తీసుకున్నాడు. ఈ అప్పు చెల్లించే క్రమాన 2019 సెప్టెంబర్ 24న రూ.2 లక్షలకు చెక్కు జారీ చేశాడు. అయితే, సతీష్ ఖాతాలో సరిపడా నగదు లేక చెక్కు తిరస్కరణకు గురైంది. దీంతో గోవింద్ తన తన న్యాయవాది ద్వారా లీగల్ నోటీస్ జారీ చేసి కోర్టులో ప్రైవేట్ కేసు దాఖలు చేశారు. విచారణ అనంతరం సతీష్‌కు ఆరు నెలల జైలుశిక్ష విధించడమే కాక ఫిర్యాదికి రూ.2లక్షలు చెల్లించాలని న్యాయమూర్తి తీర్పు చెప్పారు.