
రిటైర్డ్ ఎంఈఓకు పలువురి నివాళి
తల్లాడ: తల్లాడకు చెందిన రిటైర్డ్ ఎంఈఓ బాజోజు శేషభూషణం సేవలు మరువలేనివని పలువురు కొనియాడారు. ఇటీవల మృతి చెందిన శేషభూషణం సంతాప సభ గురువారం నిర్వహించగా సీనియర్ పాత్రికేయులు కొండుభట్ల రామచంద్రమూర్తి నివాళులర్పించి మాట్లాడారు. తల్లాడ జెడ్పీహెచ్‌ఎస్‌లో శేషభూణంతో కలిసి తాను పదో తరగతి వరకు చదివానని, ఆయన ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విద్యారంగానికి సేవ చేశారని తెలిపారు. అలాగే, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు కళ్యాణం కృష్ణయ్య తదితరులు మాట్లాడగా.. చల్లా కృష్ణారావు, డాక్టర్ వేమిశెట్టి ఉపేందర్‌రావు, గుంటుపల్లి సత్యం, కోటమర్తి రాధాకృష్ణమూర్తి, సుబ్బ య్య, శరత్‌బాబు, సూరిబాబు, రామకృష్ణ, లక్ష్మ య్య, తిరుపతిరెడ్డి, శ్రీనివాసరావు, రఘుపతిరెడ్డి, ముత్యాలు, నర్సయ్య, లక్ష్మయ్య పాల్గొన్నారు.
జాబ్‌మేళాలో
25మంది ఎంపిక
ఖమ్మం రాపర్తినగర్: జిల్లా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యాన ఖమ్మం టేకులపల్లిలోని ఐటీఐలో గురువారం జాబ్‌మేళా నిర్వహించారు. ఎంఆర్‌ఎఫ్ కంపెనీలో ఉద్యోగాలకు నిర్వహించిన ఈ మేళాకు 48 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వివిధ పరీక్షల అనంతరం 25మంది ఉద్యోగా లకు ఎంపిక చేసి నియామకపత్రాలు అందజేశారు. జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి ఎన్. మాధవి, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.