
శత్రుదేశాలకు ఇది హెచ్చరిక..
మహిళల నుదుటి సింధూరం ఆరకముందే పాక్‌లోని ఉగ్రశిబిరాలను నిర్మూలించడం మామూలు విషయం కాదు. ఇది శతృదేశాలకు హెచ్చరిక. నేను సరిహద్దులో ఏడేళ్లు విధులు నిర్వర్తించా. మళ్లీ యుద్ధం వచ్చి నన్ను పిలిస్తే గర్వంగా భావిస్తా.
– బెందు వీరబాబు, బాణాపురం
ఇది భారత విజయం
పాక్‌లోని తీవ్రవాద స్థావరాలపై మన సైన్యం దాడి చేయడం గొప్ప విజయం. సామాన్యులను హతమార్చిన తీవ్రవాదులకు ఇది గుణపాఠం. పాకిస్తాన్ లేదా తీవ్రవాదులు భారత్‌వైపు చూస్తే మన సైన్యం సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంటుంది.
– కంచర్ల ప్రసాద్, గొల్లెనపాడు
ముల్లును ముల్లుతోనే తీసినట్లు..
పహల్గామ్‌లో ప్రాణాలు కోల్పోయిన అమాయక కుటుంబాలకు ఆపరేషన్ సిందూర్‌తో ఊరట లభించింది. ముల్లును ముల్లుతోనే తీసినట్లు పాక్ తీవ్రవాదులకు మన సైన్యం గట్టి జవాబు ఇచ్చింది. దేశంమొత్తం సైన్యానికి అండగా నిలవాల్సిన సమయం ఇది. – అమరనేని మురళి, గొల్లెనపాడు

శత్రుదేశాలకు ఇది హెచ్చరిక..

శత్రుదేశాలకు ఇది హెచ్చరిక..