
ఇదే మెడికల్ కాలేజీ !
ఖమ్మంఅర్బన్: రఘునాథపాలెం బైపాస్‌లోని బల్లేపల్లి వద్ద ప్రభుత్వ మెడికల్ కాలేజీ భవన నిర్మాణాలకు గురువారం శంకుస్థాపన చేయనున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రితో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పాల్గొననుండగా.. శంకుస్థాపన తర్వాత సభ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈమేరకు కార్పొరేట్ తరహాలో నిర్మించే భవనం నమూనాను విడుదల చేశారు. కాగా, సభ ఏర్పాట్లను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవా రం సాయంత్రం పరిశీలించారు. అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ యాకూబ్, ఈఈ యుగంధర్ పాల్గొన్నారు.
కట్టుదిట్టమైన ఏర్పాట్లు
ఖమ్మంవైద్యవిభాగం: ప్రభుత్వ మెడికల్ శంకుస్థాపనకు హాజరవుతున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రితో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు జిల్లా పెద్దాస్పత్రిని కూడా తనిఖీ చేయనున్నారు. ఆతర్వాత కలెక్టరేట్‌లో వైద్య, ఆరోగ్య శాఖపై సమీక్షిస్తారు. ఈ సందర్భంగా పెద్దాస్పత్రిలో ఏర్పాట్లను కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, ఆదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి బుధవారం పరిశీలించారు. ఆస్పత్రి పరిసరాలను శుభ్రం చేయించడమే కాక శాఖకు సంబంధించి నివేదికలు సిద్ధం చేయాలని అధికారులు, వైద్యులకు సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్‌కుమార్, ఈఈ ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.

ఇదే మెడికల్ కాలేజీ !

ఇదే మెడికల్ కాలేజీ !