
మేము సైతం..
భ రతమాత సేవలో..
ఖమ్మంమయూరిసెంటర్: భరతమాతకు సేవచేసే అవకాశం వస్తే కదనరంగంలోకి దూకేందుకు ఎల్లవేళలా సిద్దంగా ఉంటామని మాజీ సైనికులు స్పష్టం చేశారు. దేశ రక్షణతో పాటు శత్రుమూకలకు బుద్ధి చెప్పేందుకు తమను పిలిస్తే గొప్పగా భావిస్తామని తెలిపారు. పాకిస్తాన్, పీఓకేలోని ఉగ్రవాద శిబిరా లపై భారత సైన్యం ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో దాడులు చేయడంపై మాజీ సైనికులు హర్షం వ్యక్తం చేశారు. ఏళ్లుగా పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు దిగుతున్నా భారత్ సంయమనం పాటించిందని.. ఇప్పు డు అమాయకులను కాల్చిచంపడంతో ‘ఆపరేషన్’కు దిగడం సరైన చర్య అని అభిప్రాయపడ్డారు. ఇదికాక యుద్ధం చేయాల్సి వచ్చినా భారత సైన్యం సిద్ధంగా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యాన జిల్లాలోని మాజీ సైనికులను పలకరించగా తమ అభిప్రాయాలు వెల్లడించారు.
●
యుద్ధం వస్తే పాల్గొనేందుకు సిద్ధం
ఎప్పుడు పిలుపు వచ్చినా
వెళ్తామంటున్న మాజీ సైనికులు
‘ఆపరేషన్ సిందూర్’పై
జిల్లా వాసుల్లో హర్షాతిరేకాలు

మేము సైతం..