
సర్టికల్ స్ట్రైక్స్ అవసరం
మిలిటెంట్ గ్రూపులన్నీ మన సైనికులు, పౌరులపై దాడులకు దిగుతున్నాయి. ఇలాంటి సమయాల్లో సర్జికల్ స్ట్రైక్ అవసరం. అయితే, ఆపరేషన్ సింధూర్‌తో పాక్‌కు ఆందోళన ఎదురవుతుంది. అంతర్జాతీయంగా ఒత్తిడి తీసుకొచ్చి పాక్‌ను దెబ్బతీయాలి. – మెహబూబ్ సుబాని, ఖమ్మం
సైన్యంతో కలిసేందుకు రెడీ
భారత్ యుద్ధం చేయాల్సి వచ్చి, మాజీ సైనికులను ఆహ్వానిస్తే పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నా. ప్రస్తుతం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ పాక్‌కు గుణపాఠం. అమాయకులను బలిగొంటున్న ఉగ్రవాదులను అణచివేయాల్సిన అవసరముంది. – కరివేద రాజేష్, ఖమ్మం
ఇదే సరైన సమాధానం
ఉగ్రవాదులను అడ్డు పెట్టుకుని కవ్వింపు చర్యలకు దిగుతున్న పాక్‌కు ఇది సరైన సమాధా నం. ఆ దేశానికి పాఠం చెప్పేలా చేపట్టిన ఆపరేషన్ సిందూర్ గొప్పది. ఆర్మీ నుండి బయటకొచ్చి ఎనిమిదేళ్లయినా మళ్లీ ఆదేశాలు వస్తే వెంటనే వెళ్తా.
– బోయపాటి రామకృష్ణ, ఖమ్మం

సర్టికల్ స్ట్రైక్స్ అవసరం

సర్టికల్ స్ట్రైక్స్ అవసరం