నెమళ్ల కోసం మందు పెట్టిన దుండగులు | - | Sakshi
Sakshi News home page

నెమళ్ల కోసం మందు పెట్టిన దుండగులు

May 8 2025 9:09 AM | Updated on May 8 2025 9:09 AM

నెమళ్

నెమళ్ల కోసం మందు పెట్టిన దుండగులు

ఖమ్మంరూరల్‌: మండలంలోని చింతపల్లిలో పొలాల వద్ద నెమళ్ల కోసం గుర్తుతెలియని వ్యక్తులు మందు పెట్టగా, ఆ మందు తినడంతో నాలుగు ఆవులు మృతి చెందాయి. గ్రామానికి చెందిన కొందరు రైతులు తమ ఆవులను మేత కోసం విడిచి పెట్టారు. ఆ ప్రాంతంలో నెమళ్లు తిరుగుతున్నాయనే సమాచారంతో దుండగులు అక్కడ ఉన్న గడ్డిపై మందు చల్లారు. అదే ప్రాంతానికి వెళ్లిన నాలుగు పశువులు గడ్డి మేయడంతో మృతి చెందాయి. ఈ విషయమై వెటర్నరీ వైద్యుడు హరీశ్‌ను వివరణ కోరగా విషపూరితమైన గడ్డి తినడంతోనే ఆవులు మృతి చెందాయని తెలిపారు. అలాగే, రైతులు వేసవిలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎక్కువ మోతాదులో అన్నం, వడ్లు, బియ్యం, మొక్కజొన్న పెడితే అరగక పొట్ట ఉబ్బి పశువులు మృతి చెందే అవకాశం ఉందని తెలిపారు.

విత్తన ఏజెంట్‌ మోసం చేశాడని రైతుల ఆగ్రహం

కొణిజర్ల: పంటకు మంచి ధర చెల్లిస్తామని చెప్పి, ఇప్పుడు ముఖం చాటేసిన కంపెనీ ప్రతినిధులు, ఏజెంట్లపై చర్యలు తీసుకోవాలని పలువురు రైతులు కోరారు. ఈ సందర్భంగా బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశాక వారు వివరాలు వెల్లడించారు. కొణిజర్ల మండలం తీగలబంజరకు చెందిన ఓ వ్యక్తి రెండు కంపెనీలకు చెందిన ఆడ, మగ రకం మొక్కజొన్న విత్తనాలను కొణిజర్ల, వైరా, కారేపల్లి, జూలూరుపాడు మండలాల్లో పలు గ్రామాల రైతులకు ఇచ్చాడు. కానీ, సరైన దిగుబడి రాకపోవడంతో ఆందోళన చేయగా పరిహారం ఇప్పిస్తానని కాగితాలు రాసి ఇచ్చాడు. ఆ తర్వాత కంపెనీకి మక్కలు తరలించినా రైతులకు డబ్బులు ఇవ్వకకపోగా ఏజెంట్‌ కానరావడం లేదు. దీంతో మంగళవారం అర్ధఽరాత్రి ఆయన ఇంటికి వచ్చినట్లు తెలుసుకుని లాలాపురం వాసులు ఆందోళన చేయగా పోలీసులు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ మేరకు బుధవారం పలువురు రైతులు బుధవారం పోలీస్‌స్టేషన్‌కు వచ్చి తమకు డబ్బులు ఇప్పించాలని ఎస్‌ఐ జి.సూరజ్‌ను కోరారు. కంపెనీ ప్రతినిధులను గురువారం పిలిపించాక చర్యలు తీసుకుంటానని తెలిపారు. అయితే, సదరు ఏజెంట్‌ ముందుగానే డబ్బు తీసుకున్నాడని కంపెనీ ప్రతినిధులు చెబుతుండగా, తనకు రూ.25 లక్షలు కంపెనీ నుంచి రావాలని ఏజెంట్‌ చెప్పినట్లు సమాచారం.

12.9 కేజీల

ఎండు గంజాయి స్వాధీనం

ఖమ్మంరూరల్‌: మండలంలోని రెడ్డిపల్లిలో డంపింగ్‌యార్డు పక్కన గుర్తు తెలియని వ్యక్తులు దాచిన 12.9 కేజీల ఎండు గంజాయిని ఖమ్మం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయిని ఎవరు దాచారు? ఎక్కడి నుంచి తీసుకొచ్చారనే అంశంపై విచారణ చేస్తున్న ట్లు సీఐ సీహెచ్‌.శ్రీనివాస్‌ తెలిపారు. కాగా, ఈ గంజాయి విలువ రూ.2 లక్షలు ఉంటుందని వెల్లడించారు. తనిఖీల్లో ఉద్యోగులు బాలు, విజయ్‌కుమార్‌, సుధీర్‌, హరీశ్‌, హన్మంతరావు, వెంకట్‌, స్వరూప తదితరులు పాల్గొన్నారు.

నాలుగు ఆవులు మృతి

నెమళ్ల కోసం మందు పెట్టిన దుండగులు1
1/1

నెమళ్ల కోసం మందు పెట్టిన దుండగులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement