
మార్క్సిజంతోనే సమస్యల పరిష్కారం
రాఘవయ్య సంస్మరణ సభలో
తమ్మినేని వీరభద్రం
ఖమ్మంసహకారనగర్: ప్రపంచంలోని సమస్త మానవాళి సమస్యలకు పరిష్కారం మార్క్సిజమేనని, ఆ మార్క్సిజాన్ని నమ్ముకుని రావిళ్ల రాఘవయ్య తుదికంటా పోరాడారని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం తెలిపారు. ఖమ్మం శ్రీనివాసనగర్‌లో బుధవారం జరిగిన యూటీఎఫ్ వ్యవస్థాపకులు, జిల్లా పూర్వ అధ్యక్షుడు రాఘవయ్య సంస్మరణ సభలో ఆయన మాట్లాడారు. ఉన్నత ఆదర్శాలను జీవితాంతం కొనసాగించిన రాఘవయ్యను నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు షేక్ రంజాన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షురాలు దుర్గాభవానితో పాటు పోతినేని సుదర్శన్, నున్నా నాగేశ్వరరావు, ఎర్రా శ్రీనివాసరావు, పారుపల్లి నాగేశ్వరరావు, రాంబాబు, బి.రాందాస్, ఎం.నర్సయ్య, పి.సురేశ్, వలీ, యలమద్ది వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.