
పహ ల్గాం బాధితుల కెరటమే ‘సిందూర్’
వైరా: పహ ల్గాం ఉగ్ర దాడిలో సర్వం కోల్పోయిన ఆడపడుచుల కన్నీటి నుంచి రాలిపడిన కెరటమే ‘ఆపరేషన్ సిందూర్’అని మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ నాయకుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి అన్నారు. పాకిస్తాన్ టెర్రరిస్టు స్థావరాలపై దాడి విజయవంతమైన నేపథ్యాన బుధవారం వైరాలోని సాయిబాబా దేవాలయంలో సైనికులకు మనోధైర్యం కలిగించాలని యాగం చేశారు. అనంతరం ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశాక బీజేపీ మండల అధ్యక్షుడు మనుబోలు వెంకటకృష్ణ అధ్యక్షతన నిర్వహించిన కులగణన అవగాహన సదస్సులో మాట్లాడారు. దేశ ప్రజల జోలికొస్తే ఎంతటి చర్యలకై నా వెనకాడేది లేదని ప్రధాని మోదీ నిరూపించారని తెలిపారు. మోదీ స్ఫూర్తిగా తీసుకుని బీజేపీ శ్రేణులు దేశాభివృద్ధిలో పాలుపంచుకోవాలని ప్రతిజ్ఞ చేయించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు, నాయకులు సన్నె ఉదయ్‌ప్రతాప్, నున్నా రవి, మందడపు సుబ్బారావు, అల్లిక అంజయ్య, దొడ్డా అరుణ, పమ్మి అనిత, వీరవెల్లి రాజేశ్‌గుప్త, నల్లగట్ల ప్రవీణ్, రవి రాథోడ్, పాల్గొన్నారు.
బీజేపీ నాయకుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి