
హౌసింగ్ శాఖకు 14 మంది ఏఈలు
ఖమ్మంగాంధీచౌక్: గృహ నిర్మాణ శాఖలో 14 మంది అసిస్టెంట్ ఇంజనీర్ల(ఏఈ)ను ఔట్ సోర్సింగ్‌విధానంలో నియమిస్తూ కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్‌మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాక వారికి పోస్టింగ్ ఇవ్వడంతో కేటాయించిన మండలాల్లో బాధ్యతలు స్వీకరించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యాన, గృహ నిర్మాణ శాఖను బలోపేతం చేయడంకోసం ఈ నియామకాలు చేపట్టారు. కాగా, జిల్లాలో నియమితులైన ఏఈల వివరాలు మండలాల వారీ గా ఇలా ఉన్నాయి. కామేపల్లి మండలానికి డి.నగేష్, నేలకొండపల్లికి వి.లింగా, రఘునాథపాలెంకు జి.పుష్ప, చింతకానికి టి.సుప్రియ, తల్లాడకు షేక్ అస్మా, ఏన్కూరుకు బి.స్నేహ, కల్లూరుకు ఎస్.సాయిపవన్, వేంసూరుకు ఎం. శ్రీనివాస్, ముదిగొండకు బి.సతీష్, ఎర్రుపాలెంకుపి.గోపి,సత్తుపల్లికి వి.పవన్‌కల్యాణ్, పెనుబల్లికి వై.కమల్‌ప్రసాద్, కూసుమంచికి ఏ.రవి, తిరుమలాయపాలెంకు మిథున్‌కుమార్‌ను కేటాయించారు.
ఉపాధి హామీ సిబ్బందికి ఊరట
మూడు నెలలు వేతనాలు విడుదల
చుంచుపల్లి: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న సిబ్బందికి ఊరట లభించింది. రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు మూడు నెలల వేతనాలను మంగళవారం విడుదల చేసింది. ఏప్రిల్‌కు సంబంధించిన వేతనాన్ని మాత్రం పెండింగ్‌లో ఉంచింది. ఉపాధి హామీ పథకం అమలులో ఏపీఓలు, ఇంజనీరింగ్ కన్సల్‌టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరికి కొంతకాలంగా సకాలంలో వేతనాలు అందడం లేదు. నాలుగు నెలలుగా వేతనాలు అందకపోవడంతో నిరసనలతో పాటు ఇటీవల పెన్‌డౌన్ నిర్వహించారు. వీరి సమస్య ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో ఎట్టకేలకు జనవరి, ఫిబ్రవరి, మార్చి వేతనాలను విడుదల చేసింది. ఉమ్మడి జిల్లాలో ఉపాధి హామీ పథకంలో 839 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. వేతనాలు జమ కావడంతో ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు.
సహకార ఆడిట్‌పై శిక్షణ
ఖమ్మంవ్యవసాయం: ఖమ్మంలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) ప్రధాన కార్యాలయంలో మంగళవారం సహకార శాఖ అసిస్టెంట్ రిజి స్టార్లు, సీనియర్ ఇన్‌స్పెక్టర్లు, జూనియర్ ఇన్‌స్పెక్టర్లకు సహకారఆడిట్‌పై శిక్షణ ఇచ్చారు. ఈసందర్భం గా జిల్లా సహకార అధికారి జి.గంగాధర్, డీసీసీబీ సీఈఓ ఎన్.వెంకట్ ఆదిత్య పలు అంశాలపై అవగాహన కల్పించారు. డీసీసీబీ చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావుతో పాటు అధికారులు మురళీధర్‌రావు, సీహెచ్.రవికుమార్, కె.సందీప్, ఎస్‌కే.మౌలానా, పీఏసీఎస్‌ల కార్యదర్శులు పాల్గొన్నారు.
డీఈఐఈడీ, డీపీఎస్‌ఈలో ప్రవేశాలు
ఖమ్మం సహకారనగర్: డీఈఐఈడీ(డిప్లొమా ఇన్ ఎలి మెంటరీఎడ్యుకేషన్), డీపీఎస్‌ఈ(డిప్లొమా ఇన్‌ప్రీ స్కూ ల్ ఎడ్యుకేషన్) కోర్సుల్లో డీఈఈసీఈటీ ద్వారా ప్రవేశాలు కల్పించనున్నట్లు డీఈఓ, డైట్ ప్రి న్సి పాల్ ఎస్.సత్యనారాయణ తెలిపారు. ఈ పరీక్ష ఆన్‌లైన్ విధానంలో ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న ఉమ్మడి జిల్లాలోని అభ్యర్థులు ఈనెల 15వ తేదీవరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.