
అగ్నికి ఆహుతైన మొక్కజొన్న, ధాన్యం
చింతకాని: మండలంలోని నర్సింహాపురం, రామకృష్ణాపురం, ప్రొద్దుటూరు గ్రామాల్లో మంగళవారం వే ర్వేరుగా జరిగిన అగ్నిప్రమాదాల్లో మొక్కజొన్న, ధా న్యం కాలి బూడిదయ్యాయి. మొక్కజొన్న చెత్తకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడం.. అదే సమయాన భారీగా వీచిన ఈదురుగాలులతో మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది. నర్సింహాపురంలో జరిగిన ప్రమాదంలో కల్లాల్లో ఇద్దరు ఆరబోసిన సుమారు 300 క్వింటాళ్ల మొక్కజొన్న కంకులు పూర్తిగా కాలిపోయాయి. మంటలు గ్రామానికి సైతం వ్యాపించగా ద్విచక్ర వా హనంతో పాటు వరిగడ్డి వామి, రోటోవేటర్ దగ్ధమయ్యాయి. అలాగే, రామకృష్ణాపురంలోనూ ఈదురుగాలులకు మంటలు వ్యాపించి మామిడి చెట్లు, వ్యవసాయ విద్యుత్ మోటార్లు, గడ్డివాములు కాలిపోయా యి. గ్రామంలోకి మంటలురాకుండా గ్రామస్తులు మో టార్ల సాయంతో నీళ్లు చల్లినా అదుపులోకి రాలేదు. దీంతో అగ్నిమాపక శాఖ ఉద్యోగులకు సమాచారం ఇవ్వగా ఫైర్ ఆఫీసర్ బాలకృష్ణ, అగ్నిమాపక సిబ్బంది నాగేశ్వరరావు, నర్సింహారావు, గోపీకృష్ణ, రాంబాబు, మంద వీరస్వామి, నరేష్ చేరుకుని సుమారు రెండు గంటలపాటు శ్రమించిమంటలను అదుపుచేశారు. ఈ సమయాన గ్రామమంతా పొగతో నిండిపోవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఇక ప్రొద్దుటూరులో సైతం మొక్కజొన్న కంకితో పాటు కల్లాల్లో ఆరబోసిన ధాన్యం మంటలకు దగ్ధమైంది. నర్సింహాపురంలో సుమారు రూ.7.30 లక్షలు, ప్రొద్దుటూరులో రూ.లక్ష, రామకృష్ణాపురంలో రూ.2 లక్షల విలువైన పంటలకు నష్టం జరిగినట్లు బాధిత రైతులు తెలిపారు.
మూడు గ్రామాల్లో రూ.10లక్షలకు పైగా నష్టం