
గంజాయి రవాణాపై ఉక్కుపాదం
వైరా: జిల్లా మీదుగా గంజాయి రవాణాను పూర్తిగా నియంత్రించడంపై దృష్టి సారించామని ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ జి.జనార్దన్‌రెడ్డి వెల్లడించారు. ఇందులో భాగంగానే విస్తృత తనిఖీలు చేస్తున్నామని తెలిపారు. మంగళవారం వైరా వచ్చిన ఆయన ఎకై ్సజ్ కార్యాలయంలో మాట్లాడారు. ఏపీ, ఒడిశా నుంచి ఖమ్మం మీదుగా హైదరాబాద్, బెంగళూరు తదితర ప్రాంతాలకు గంజాయి తరలిస్తున్నారనే సమాచారంతో వైరాలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని చెప్పారు. బస్టాండ్‌తో పాటుగా ఇతర ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగిస్తున్నామని చెప్పారు. కాగా, వైరా ఎకై ్సజ్ కార్యాలయాన్ని పాత జీపీ కార్యాలయం, ఎన్నెస్పీ భవనాల్లోకి మార్చే ప్రతిపాదన ఉందని డీసీ తెలిపారు. జిల్లా ఎకై ్సజ్ అధికారి జి.నాగేందర్‌రెడ్డి, సీఐ మమత, ఎస్సైఐలు రతన్‌ప్రసాదరెడ్డి, సాయిరాం పాల్గొన్నారు.
ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి