
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే ప్రజాపాలన
నేలకొండపల్లి: బీఆర్‌ఎస్ హయాంలో పదేళ్ల పాటు అసమర్ధ పాలన కొనసాగితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రజల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా పాలన సాగిస్తున్నామని రాష్డ్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు తెలిపారు. మండలంలోని కోరట్లగూడెంలో కాంగ్రెస్ సేవాదళ్ నియోజకవర్గ కన్వీనర్ బచ్చలకూరి నాగరాజు నివాసంలో పలువురు నాయకులతో కలిసి సోమవారం సన్నబియ్యంతో భోజనం చేశారు. అలాగే, నాగేశ్వరరా వు జన్మదిన వేడుకల సందర్భంగా కట్ చేసిన ఆయన మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, కేంద్రం సహకరించుకునా కాంగ్రెస్ ఎన్నికల వేళ ఇచ్చిన హమీలన్నీ అమలు చేస్తుందని తెలిపారు. గత పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని, ఇప్పుడు కొత్త కార్డులు మంజూరు చేస్తూనే సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని చెప్పారు. అనంతరం కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ మాట్లాడుతూ ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ఆరోపణలను పార్టీశ్రేణులు తిప్పికొట్టాలని కోరారు. మార్కెట్ చైర్మన్ వెన్నపూసల సీతారాములు, నాయకులు శాఖమూరి రమేష్, కొడాలి గోవిందరావు, జెర్రిపోతుల అంజిని, యడవల్లి నాగరాజు, హన్మంతరావు, జెర్రిపోతుల సత్యనారాయణ, మార్తి కోటి, గట్టిగుండ్ల విజయ్, కడియాల నరేష్, కణతాల లీలావతి తదితరులు పాల్గొన్నారు.