
అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ముదిగొండ: ముదిగొండ మండలంలో పలు అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. తొలుత వల్లభిలో మాజీ ఎంపీటీసీ బిచ్చాల బిక్షం కుమార్తె వివాహానికి హాజరైన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం బాణాపురంలో రూ.67లక్షలతో నిర్మించే బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశాక కంఠమహేశ్వరస్వామి ఆలయ ఉత్సవాల్లో పాల్గొన్నారు. అనంతరం ముదిగొండలో 50పడకల ఆరోగ్య కేంద్రానికి శంకుస్థాపన చేసి ఇందిరా డెయిరీ పాలశీతలీకరణ కేంద్రాన్ని ప్రారంభించారు. అంతేకాక 27 గ్రామాల్లో అంతర్గత రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. ముదిగొండకు వచ్చిన డిప్యూటీ సీఎంకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఈకార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ బి శ్రీనివాస్‌రెడ్డి, మండల ప్రత్యేకాధికారి విజయలక్ష్మి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, డీఎంహెచ్‌ఓ, డాక్టర్ కళావతిబాయి, ఆస్పత్రుల సమన్వయకర్త రాజశేఖర్‌గౌడ్, వైద్యాధికారి అరుణాదేవి, సొసైటీ డైరెక్టర్ వనం ప్రదీప్త చక్రవర్తి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రమేష్‌బాబుతో పాటు మందరపు నాగేశ్వరరావు, పసుపులేటి దేవేంద్రం, వల్లూరి భద్రారెడ్డి, మట్టా బాబురాంరెడ్డి, కందిమళ్ల వీరబాబు, ఎండీ అజ్గర్, కోలేటి నాగేశ్వరరావు, ఆదినారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.