
ఆ.. విత్తనమే కావాలి
మరికొద్ది రోజుల్లో వ్యవసాయ సీజన్ ప్రారంభం కాబోతోంది. ఈ క్రమంలో రైతులు పత్తి తోటల కోసం దుక్కులు దున్ని విత్తనాల కోసం దుకాణాల బాట పట్టారు. అయితే గత ఏడాది దిగుబడిని దృష్టిలో పెట్టుకున్న రైతులు ఒకే రకం పత్తి విత్తనం కావాలని అడుగుతుండడంతో ఆయా రకాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. జిల్లాకు వచ్చిన ఆ రకం పత్తి విత్తనాలు హాట్‌కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఎక్కువ మొత్తంలో ఈ విత్తనాలు కావాల్సిన రైతులు ఎంతదూరమైనా వెళ్లి తెచ్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. అయితే వ్యవసాయ శాఖ మాత్రం మిగతా రకాల విత్తనాలతో కూడా మంచి దిగుబడి సాధించొచ్చని చెబుతోంది. జిల్లాలో ఇప్పటికే పత్తి విత్తనాలు అందుబాటులోకి వచ్చాయని, వాటిని కొనుగోలు చేయాలని సూచిస్తోంది. – సాక్షిప్రతినిధి, ఖమ్మం
పత్తి సాగుకు రైతులు సన్నద్ధం
● డిమాండ్ ఉన్న విత్తనం కోసం పరుగులు
● సుదూర ప్రాంతాలకు వెళ్తున్న రైతులు
● జిల్లాలో అందుబాటులోకి
పత్తి విత్తనాలు
● ఇతర రకాలతోనూ మంచి దిగుబడులు వస్తాయంటున్న వ్యవసాయ శాఖ