పాల్వంచ: షార్ట్ సర్క్యూట్‌తో ఆటోమొబైల్ షాపు దగ్ధమైంది. స్థానికుల కథనం మేరకు.. పట్టణంలోని బీసీఎంరోడ్‌లో అంబేడ్కర్ సెంటర్ వద్ద గల ఆటోమొబైల్ షాపులో శుక్రవారం సాయంత్రం షార్ట్ సర్క్యూట్ జరి గి మంటలు లేచి, వస్తువులకు అంటుకున్నాయి. ఆటోమొబైల్ షాపు కావడంతో షాపులోని స్పేర్ పార్టులు, ఆయిల్, ఇతర విలువైన సామగ్రి దగ్ధమైంది. ఇంజన్ ఆయిల్ ప్యాకెట్లు ఉండటంతో మంటలు పెద్దఎత్తున చెలరేగాయి. పక్క షాపుల నిర్వాహకులు సైతం భయాందోళనలతో బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న కొత్తగూడెం ఫైర్ ఇంజన్, కేటీపీఎస్ ఫైర్ ఇంజన్‌లు అక్కడికి చేరుకుని సుమారు రెండు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సుమారు రూ.25 లక్షల వరకు ఆస్తినష్టం సంభవించిందని బాధితుడు వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణ ఎస్‌ఐ రాము ఘటనా స్థలాన్ని సందర్శించారు. కొత్తగూడెం ఫైర్ ఆఫీసర్ జి.పుల్లయ్య ఆధ్వర్యంలో సిబ్బంది ఎస్‌కె.సైదులు, శ్రీను, కార్తీక్, ప్రతాప్ పాల్గొన్నారు.
సుమారు రూ.25 లక్షల ఆస్తి నష్టం