
స్వామికి స్వర్ణ రుద్రాక్షమాల అలంకరిస్తున్న ఎస్పీ వినీత్ దంపతులు
భద్రాచలంటౌన్: భద్రాచలం డిగ్రీ కళాశాల సెంటర్‌లోని సాయిబాబా మందిరంలో స్వామికి బుధవారం ఉగాదిని పురస్కరించుకుని స్వర్ణ రుద్రాక్ష మాల అలంకరించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యాన రూ.44 లక్షల వ్యయంతో ఈ మాల తయారుచేయించగా ఎస్పీ డాక్టర్ వినీత్ దంపతులు స్వామి వారికి అలంకరించారు. అనంతరం అభిషేకం, అర్చనలు నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు తుమ్మలపల్లి సత్యనారాయణమూర్తితో పాటు కురిచేటి శ్రీనివాసరావు, కొమ్మనాపల్లి ఆదినారాయణ, కుంచాల రమేష్, సుబ్రహ్మణ్యం, శ్రీనివాసరావు, వెంకటరమణ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
కిన్నెరసానిలో
‘ఉగాది’ సందడి
పాల్వంచరూరల్: ఉగాది పర్వదినంతోపాటు సెలవు కావడంతో బుధవారం మండలంలోని పర్యాటక ప్రాంతమైన కిన్నెరసానికి పెద్దసంఖ్యలో పర్యాటకులు తరలివచ్చారు. దీంతో కిన్నెరసాని ప్రాజెక్టు పరిసరాలు కోలహలంగా మారాయి. జలాశయంలో బోటు షికారు చేయడమే కాక డీర్ పార్కును సందర్శించి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉత్సాహంగా గడిపారు. కాగా, పర్యాటకుల టికెట్ల ద్వారా వైల్డ్‌లైఫ్ శాఖకు రూ.12,690, బోటుషికారు టికెట్ల ద్వారా టూరిజం కార్పొరేషన్‌కు రూ.12,570 ఆదాయం సమకూరింది.