
ఎస్‌ఐ స్రవంతి, భాస్కర్‌ను సముదాయిస్తున్న ఎమ్మెల్యే ఉపేందర్‌రెడ్డి
నేలకొండపల్లి: నేలకొండపల్లిలో బీఆర్‌ఎస్ కార్యాలయం, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ప్రారంభోత్సవం బుధవారం జరగగా, కార్యక్రమానికి హాజరైన ఎస్‌ఐ స్రవంతి, మాదిగ హక్కుల దండోరా వ్యవస్థాపకులు యాతాకుల భాస్కర్ నడుమ వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. ఇదంతా ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి ఎదుటే జరగగా, ఆయన ఇద్దరిని సముదాయించాల్సి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించేందుకు ఎమ్మెల్యే హాజరుకాగా, ఎస్‌ఐ స్రవంతిరెడ్డి ఆధ్వర్యాన బందోబస్తు ఏర్పాటుచేశారు. కార్యక్రమానికి హాజరైన మాదిగ హక్కుల దండోరా వ్యవస్థాపకుడు యాతాకుల భాస్కర్ అక్కడ ఎస్‌ఐని చూడగానే.. సదాశివాపురంలో తన పొలం పంట కాల్వను ధ్వంసం చేసిన ఘటనపై ఎనిమిది నెలల కిందట ఫిర్యాదు చేసినా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఈ క్రమంలో ఆయన ఎస్‌ఐని ఏకవచనంతో సంబోధించారని సమాచారం. ఈ ఘటనపై భాస్కర్ మాట్లాడుతూ కేసు విషయమై ఆరా తీయడమే కాక తనను స్టేషన్‌కు రమ్మని ఎందుకు పిలిచారని అడిగితే తననే ఏకవచనంతో పిలిచి అవమానించారని, దళిత సర్పంచ్ భర్త, ఓ సంఘం రాష్ట్ర నేత అయిన తనతో దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. ఎస్‌ఐపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.
కాగా, ఈ విషయమై ఎస్‌ఐ మాట్లాడుతూ ఎమ్మెల్యే కార్యక్రమంలో విధులు నిర్వర్తిస్తున్న తనతో భాస్కర్ వ్యవహరించిన తీరు బాగాలేదన్నారు. మహిళా అధికారిని ఏకవచనంతో మాట్లాడడమే కాక అసమర్థ అధికారి అని పేర్కొన్నారని, ఈ విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.
ఇద్దరినీ సముదాయించిన
ఎమ్మెల్యే ఉపేందర్‌రెడ్డి