
కర్ణాటక : కౌంటింగ్ కూడా జరగకముందే మీరే మా ఎమ్మెల్యే అంటూ జేడీఎస్ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు. తుమకూరు సిటీలో జేడీఎస్ విజయం సాధిస్తుందని చెబుతూ అభ్యర్థి గోవిందరాజకు నేమ్ బోర్డు తయారు చేసి అందించారు. ఈ విషయం తెలిసి ఓటర్లు అవాక్కయ్యారు.
ఈ నేపథ్యంలో ఉదయం 11 గంటల వరకు వెల్లడైన ఫలితాల సరళిని పరిశీలిస్తే.. గోవిందరాజ లీడింగ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. బీజేపీ సమీప అభ్యర్థి జీ.బీ. జ్యోతిగణేష్‌పై ఆయన 1014 ఓట్ల ఆధిక్యంలో ఉన్నట్టు సమాచారం. అభిమానుల అంచనాలు నిజం చేస్తూ గోవిందరాజ ఎమ్మెల్యేగా విజయం సాధిస్తారో చూడాలి.