యశవంతపుర: పాఠశాలలో మితిమీరిన రాజకీయాలు, ఉపాధ్యాయుల వేధింపులను తట్టుకోలేక ప్రధానోపాధ్యాయుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన దావణగెరె జిల్లా హరిహర వద్ద కుక్కనూరు ప్రభుత్వ పాఠశాలలో జరిగింది. హెచ్‌ఎం జయప్ప (54) పాఠశాల మరుగుదొడ్డికి వెళ్లి పురుగుల మందు తాగి చనిపోయాడు. జయప్ప భార్య అంజనమ్మ ఫిర్యాదు మేరకు ఐదుమంది ఉపాధ్యాయులు, మధ్యాహ్న భోజన సిబ్బంది, సీఆర్‌పీ, బీఆర్‌పితో పాటు 10 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అవినీతికి సహకరించలేదని, తమ మాట వినడం లేదని నిత్యం కులం పేరుతో దూషించేవారని ఆమె తెలిపింది. టీచర్లు శ్రీకాంతాచారి, వెంకటేశ్, రంజని, చేతన, మహంతేశ్ గౌళి, వంట సహయకురాలు సుమా, చెన్నమ్మ, రూపా, విజయ నిందితుల్లో ఉన్నారు. ఆయన గత 10 నెలల నుంచి ఇక్కడ హెచ్‌ఎంగా పనిచేస్తున్నారు.
దావణగెరె జిల్లాలో విషాదం


