4 సొండిగలు రూ.150 | - | Sakshi
Sakshi News home page

4 సొండిగలు రూ.150

Apr 3 2026 7:20 AM | Updated on Apr 3 2026 7:20 AM

పబ్‌లో ఆర్డరిస్తే ఇంతే

శివాజీనగర: సొండిగలు.. లేదా గొట్టాలు పిల్లలూ, పెద్దలూ ఇష్టంగా ఆరగిస్తారు. అంగళ్లలో ఒకప్పుడు పావలా ఇస్తే రెండు, మూడు ఇచ్చేవారు, ఇప్పుడు రూ.10 అయ్యాయి. బెంగళూరులోని ఇందిరానగరలో ఉన్న ప్రముఖ పబ్‌లో ఓ వినియోగదారు గొట్టాలకు చాలా ఎక్కువ చెల్లించానని వాపోతున్నాడు. ఓ పబ్‌కు వెళ్లిన అతడు ‘చిల్లీ డస్టెడ్‌ గోల్డ్‌ ఫింగర్స్‌’ అనే ఆకర్షణీయమైన పేరుతో మెనూ కార్డులో ఉన్న చిరుతిండిని ఆర్డర్‌ చేశానని సోషల్‌ మీడియాలో తెలిపాడు. అదేదో ప్రత్యేకమైన వంటకమని అనుకున్నట్లు చెప్పాడు. అయితే వెయిటర్‌ తీసుకొచ్చిన ప్లేట్‌లో సాధారణ గొట్టాలు కొన్ని ఉన్నాయని, దానికి ఇంత ధరా? అని ప్రశ్నించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement