నేటి నుంచి మధుమేహ శిబిరం
రాయచూరు రూరల్: నగరంలో మూడు రోజుల పాటు మధుమేహ వ్యాధి చికిత్స శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు కర్ణాటక చాప్టర్ రిసెర్చ్ సొసైటీ డయాబిటిస్ సంఘం అధ్యక్షుడు బసవరాజ్ పాటిల్ పేర్కొన్నారు. గురువారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాయచూరులో నవోదయ వైద్య కళాశాలలో నవోదయ వైద్య కళాశాల, రిమ్స్‌ల ఆధ్వర్యంలో ఈనెల 19 నుండి 21 వరకు మధుమేహ వ్యాధిపై సుదీర్ఘ చర్చలకు తోడు వివిధ నిపుణులైన వైద్యులతో సలహా, సూచనలకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. గ్రామాలను దత్తత తీసుకొని వ్యాధి నియంత్రణకు ఉచిత పరీక్షలను చేపడుతున్నట్లు తెలిపారు. హరిప్రసాద్, రామకృష్ణ, మహాలింగ, సురేష్ సగరద, ఎస్‌ఎస్‌రెడ్డిలున్నారు.


