 
															అవార్డులకు సాహితీవేత్త అగ్గి
● సర్కారుపై తీవ్ర నిరసన
మాలూరు: కోలారు జిల్లాలో హృదయ విదారక సంఘటన జరిగింది. సీనియర్ సాహితీవేత్త హరిహర ప్రియ గతంలో గుండెపోటుకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందారు, అప్పుడు చాలా డబ్బులు ఖర్చయ్యాయి, ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందలేదని ఆవేదనతో హరిహర ప్రియ తనకు వచ్చిన అవార్డులను దగ్ధం చేసి ఆక్రోశాన్ని వెలిబుచ్చారు. మాలూరు గ్రీన్ సిటి కాలేజ్ సమీపంలో పుస్తకమనె అనే నివాసంలో హరిహర ప్రియ నివసిస్తున్నారు. గతేడాది గుండెపోటు వచ్చి బెంగుళూరులోని కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొంది కోలుకున్నారు. తనకు వైద్యం ఖర్చులు అందించాలని హరిహరప్రియ ప్రభుత్వానికి, జిల్లా అధికారులకు విన్నవించారు. కానీ ఎలాంటి స్పందన లేదని వాపోయారు. అరణ్య రోదనే అయ్యింది. గురువారం తన అవార్డులను రోడ్డుపై వేసి కాల్చివేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
