ఈ–ఖాతాల సత్వర పూర్తికి ఆదేశం
రాయచూరు రూరల్ : ప్రభుత్వం నిర్ణయించిన ఈ– ఖాతాలను నగరంలో సత్వరం పూర్తి చేయడానికి అధికారులు ముందుకు రావాలని నగర శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్, విధాన పరిషత్ సభ్యుడు వసంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా పంచాయతీ భవనంలో జరిగిన నగరసభ సామాన్య సమావేశంలో మాట్లాడారు. నగరసభ అధ్యక్షురాలు నరసమ్మ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కమిషనర్ జుబీన్ మహాపాత్రోను మందలించారు. మురికి వాడల ప్రాంతంలో ఇళ్ల పట్టాలిచ్చి వారి నుంచి పన్నులను వసూలు చేసిన వారికి నేడు ఈ–ఖాతాలు ఇవ్వకుండా పెండింగ్‌లో పెట్టడం తగదన్నారు.
రోడ్ల మరమ్మతులో విఫలం
నగరంలో గుంతలు పడ్డ రహదారులకు మరమ్మతులు చేపట్టడంలో శాసన సభ్యుడు విఫలమయ్యారని నగరసభ సభ్యుడు శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. దీనిపై స్పందించిన శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్ మాట్లాడుతూ శాసన సభ్యులకు గుంతలు పూడ్చడానికి నిధులు రావని, నగరసభ వారే చేపట్టాలని సూచించారు. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. జిల్లా ఇంచార్జి మంత్రి శరణ ప్రకాష్ పాటిల్, మరో మంత్రి బోసురాజులను ప్రశ్నించాలన్నారు. నగరంలో 287 దుకాణాలుండగా, 110 దుకాణాల మరమ్మతులు, 117 దుకాణాల నుంచి నెలకు రూ.800 చొప్పున బాడుగ లభిస్తున్నట్లు అధికారులు వివరించారు.
రూ.18 కోట్ల పన్ను వసూలు
ఈ విషయంలో టెండర్లు పిలిచి వాటి ధరలను పెంచాలన్నారు. రూ.28 కోట్ల పన్నుల వసూళ్లలో రూ.18 కోట్లు వసూలు చేశామన్నారు. నూతనంగా ఎన్నికై న 31వ వార్డు నగరసభ సభ్యురాలు అంజినమ్మ పేరు గల బోర్డు లేకపోవడంతో అధికారులు వెంటనే బోర్డును సిద్ధం చేశారు. 8 మంది బీజేపీ సభ్యులు గైర్హాజరయ్యారు. సమావేశంలో ఉపాధ్యక్షుడు సాజిద్ సమీర్, అధికారులు జయపాల్ రెడ్డి, విజయ లక్ష్మి, మేనకా పాటిల్, సభ్యులు బసవ రాజ్, జయన్న, నాగరాజ్, జిందప్ప, రేఖా, సరోజమ్మ, శరణ బసవ, రమేష్‌లున్నారు.
ఎమ్మెల్యే, కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం
సమావేశానికి గైర్హాజరైన బీజేపీ సభ్యులు
ఈ–ఖాతాల సత్వర పూర్తికి ఆదేశం


