
జూన్ 6న మాదేవ చిత్రం విడుదల
రాయచూరు రూరల్: రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 6న మాదేవ చిత్రం విడుదల కానుందని కన్నడ చలన చిత్ర నటుడు వినోద్ ప్రభాకర్ వెల్లడించారు. ఆయన మంగళవారం రాత్రి మంత్రాలయంలో గురు రాఘవేంద్ర స్వాములను దర్శనం చేసుకున్నారు. మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ శ్రీపాదంగళ్ ఆయనకు శాలువా కప్పి సన్మానించారు. అనంతరం తనను కలసిన విలేఖర్లతో ఆయన మాట్లాడారు. తండ్రి బాటను అనుసరించి నటన చేయడం లేదన్నారు. మాదేవ చిత్రం విజయ వంతం కావాలని ఆలయాల దర్శనం చేసుకుంటున్నట్లు తెలిపారు. మైసూరు శాండల్ సోప్‌లకు రాయబారిగా తమన్నా భాటియాను నియమించడంపై మాట మార్చారు. నందిని పాల ఉత్పత్తులకు డాక్టర్ పునీత్ రాజ్‌కుమార్‌ను రాయబారిగా నియమించిన విషయాన్ని గుర్తు చేశారు. తనకు అవకాశం లభిస్తే తాను కూడా రాయబారిగా పని చేస్తానన్నారు.