
యుద్ధ విరమణ నిర్ణయం సరికాదు
హుబ్లీ: యుద్ధ విరామానికి అనుమతినిచ్చిన భారత సర్కార్ నిర్ణయం మంచిది కాదని శ్రీరామ సేన చీఫ్ ప్రమోద్ ముతాలిక్ అభిప్రాయపడ్డారు. ఆయన ఆదివారం స్థానిక మీడియాతో మాట్లాడారు. పాకిస్తాన్‌కు తగిన గుణపాఠం చెప్పాలనేదే మన ధ్యేయం కావాలన్నారు. ఉన్నఫళంగా యుద్దవిరామ నిర్ణయం చాలా బాధ కలిగించిందని, కేంద్రం ఈ నిర్ణయానికి స్వస్తి చెప్పి పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పాలన్నారు. అప్పుడే పహల్గాం మృతుల ఆత్మకు శాంతి లభిస్తుందన్నారు. మనకు సలహాలు ఇచ్చేందుకు అమెరికా అధ్యక్షుడు ఎవరని, ఆయనకు మన బాధ ఎలా తెలుస్తుందని ధ్వజమెత్తారు. మధ్యవర్తిత్వం చేసే అవసరం అమెరికాకు ఏముందని ప్రశ్నించారు, దీనిని ప్రధాని మోదీ ఆమోదించకూడదన్నారు.
శ్రీరామ సేన చీఫ్ ప్రమోద్ ముతాలిక్