
నీటి ఎద్దడిపై ఎమ్మెల్యే నిలదీత
రాయచూరురూరల్: రేండేళ్లుగా నీటి ఎద్దడితో ఇబ్బందులు పడుతున్నా తమ గురించి పట్టించుకోరా అంటూ లింగసూగురు తాలుకా ముదుగల్ వాసులు లింగసూగూరు శాసన సభ్యుడు వజ్జల్ మానప్పను నిలదీశారు. శనివారం సాయ్రంతం ముదుగల్‌లో అధికారుల సమావేశం ముగించుకొని వెళ్తుండగా ప్రజలు ఘెరావ్ చేశారు. చుక్కనీటి కోసం నిత్యం పడరానిపాట్లు పడుతున్నామన్నారు. తమ గోడు వినిపించుకోరా అని ఎమ్మెల్యేను ప్రశ్నించారు. పట్టణ పంచాయతీ ద్వారా నీటి ఎద్దడి సమస్యను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇవ్వడంతో ప్రజలు శాంతించారు.
ముగిసిన అడవితల్లి ఉత్సవాలు
రాయచూరురూరల్: మాన్వి తాలుకా గౌడురులో మారెమ్మ అడవి తల్లి ఉత్సవం వైభవంగా ముగిసింది. శనివారం రాత్రి వందలాది మంది భక్తుల సముక్షంలో ఉత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా అడవి తల్లి విగ్రహానికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించి అలంకరణ చేసి ప్రత్యేక పూజలను నేరవేర్చారు. గ్రామంలో ప్రతి ఇంటి నుంచి తెచ్చిన కాయగూరులు, పూలు, పండ్లు అమ్మవారికి సమర్పించారు.
బసవేశ్వర హేమరెడ్డి మల్లమ్మ చిత్రపటాల ఊరేగింపు
హొసపేటె: వీరశైవ జిల్లా తాలూకా, నగర యూనిట్, జిల్లా యంత్రాంగం సహకారంతో లింగాయత్ మహాసభ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం నగరంలో విశ్వగురు బసవేశ్వర, శివశరణే హేమారెడ్డి మల్లమ్మ జయంతిని ఘనంగా ఆచరించారు.ఈ సందర్భంగా ఊరేగింపు వేడుకలను ఘనంగా నిర్వహించారు. కొట్టూరు స్వామి మఠం నుంచి ప్రారంభమైన ఊరేగింపు మసీదు, పవిత్ర స్థలం, సర్కిల్, పునీత్ రాజ్‌కుమార్ సర్కిల్, కాలేజ్‌రోడ్ వయా శ్రీ బసవేశ్వర సర్కిల్ వరకు నిర్వహించారు. హుడా అధ్యక్షుడు హెచ్‌ఎన్‌ఎప్ ఇమామ్ నియాజీ, ఆల్ ఇండియా వీరశైవ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, విజయనగరం జిల్లా అధ్యక్షుడు సంగప్ప, కార్యదర్శి చంద్రశేఖర్, నగర యూనిట్ అధ్యక్షుడు గొగ్గ చెన్నబసవరాజ్, సీనియర్ నాయకులు, మహిళలు పాల్గొన్నారు. వివిధ కళా బృందాలు కూడా మార్గమధ్యలో వచన పాటలను ప్రదర్శించారు.
నేడు బుద్ధపూర్ణిమ ఉత్సవాలు
హుబ్లీ: పిరమిడ్ ద్యానుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం బుద్ధ పూర్ణిమ ఉత్సవాలను సంతోష్ నగర్ నృపతుంగ గుట్ట వద్ద ఏర్పాటు చేసినట్లు ఆ మందిరం అధ్యక్షుడు మంజునాథ సావుకార తెలిపారు. సంగీత కార్యక్రమం, సాంస్కృతిక కార్యక్రమాలు, సామూహిక ధాన్యం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన గురువులతో జ్ఞాన బోధన కార్యక్రమం ఉంటుందన్నారు. బ్రహ్మనంద గురూజీ సద్గురు సమర్థ డాక్టర్.ఏసీ వాలి, బ్రహ్మర్షి ప్రేమనాథ, అయ్యప్ప పాల్గొంటారన్నారు. సమావేశంలో విశాలక్షి ఆకలవాడి, బసవరాజ్ వస్త్రాద, నీలకంఠ వస్త్రద, పాల్గొన్నారు.
రౌడీషీటర్లకు వార్నింగ్
హొసపేటె: రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడాలని ఎస్పీలు, డీసీలకు సీఎం సిద్ధరామయ్య కఠినమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో విజయనగర జిల్లా ఎస్పీ శ్రీ హరిబాబు ఆదివారం సాయంత్రం హొసపేటలో రౌడీషీటర్లను సమావేశపరచి వార్నింగ్ ఇచ్చారు. మంచిగా నడుచుకోవాలని, నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హత్య కేసుల్లో ప్రమేయం ఉన్న రౌడీషీటర్ల వివరాలు సేకరించారు.

నీటి ఎద్దడిపై ఎమ్మెల్యే నిలదీత

నీటి ఎద్దడిపై ఎమ్మెల్యే నిలదీత

నీటి ఎద్దడిపై ఎమ్మెల్యే నిలదీత