
కేకే ఎక్స్‌ప్రెస్‌కు బాంబు బెదిరింపు
రాయచూరురూరల్: న్యూఢిల్లీ–బెంగళూరు మధ్య సంచరించే కర్ణాటక ఎక్స్‌ప్రెస్ రైలుకు బాంబు బెదిరింపు వచ్చింది. బోగీలో బాంబు ఉంచినట్లు దుండగులు ఆదివారం వేకువజామున వాడీలోని రైల్వే కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేశారు. రైలు వాడీ జంక్షన్‌కు చేరుకోగానే డాగ్ స్క్వాడ్‌తో మొత్తం 22 బోగీల్లో క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎక్కడా బాంబు ఆచూకీ లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. తనిఖీల కారణంగా రైలు నాలుగు గంటల ఆలస్యంగా ప్రయాణించింది. ఇదిలా ఉండగా బెదిరింపు కాల్ చేసిన యూపీకి చెందిన దీపసింగ్ రాథోడ్(33)గా గుర్తించి అరెస్ట్ చేశారు. ఇతను గుంతకల్లు వరకు టికెట్ తీసుకొని ఇదే రైలులో ప్రయాణించినట్లు గుర్తించారు. నిందితుడిని న్యాయమూర్తి ముందు హజరుపరచినట్లు యస్‌ఐ వీరభద్రప్ప వెల్లడించారు.
తనిఖీలు నిర్వహించిన పోలీసులు
ఉత్తుత్తి బాంబు బెదిరింపుగా నిర్ధారణ
నిందితుడి అరెస్ట్

కేకే ఎక్స్‌ప్రెస్‌కు బాంబు బెదిరింపు

కేకే ఎక్స్‌ప్రెస్‌కు బాంబు బెదిరింపు