మానవత, దానగుణంతో జీవించాలి | - | Sakshi
Sakshi News home page

మానవత, దానగుణంతో జీవించాలి

Apr 11 2025 1:09 AM | Updated on Apr 11 2025 1:09 AM

మానవత

మానవత, దానగుణంతో జీవించాలి

హోసపేటె: ఒక వ్యక్తి ముందుగా మానవతా లక్షణాలను పెంపొందించుకుని దానగుణంతో జీవించాలని లోక్‌సభ సభ్యుడు ఈ.తుకారాం అన్నారు. గురువారం నగరంలోని బసవేశ్వర సర్కిల్‌ సమీపంలో సిద్దిప్రియ కళ్యాణ మంటపంలో జరిగిన 6 జిల్లాల హజ్‌ యాత్రికులకు నిర్వహించిన శిక్షణా శిబిరంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ముస్లిం సమాజానికి హజ్‌ యాత్ర చాలా పవిత్రమైనదన్నారు. ఈ తీర్థయాత్రకు వెళ్లే వారికి శిక్షణ ఇవ్వడం చాలా అవసరమన్నారు. అలాంటి పనిని హుడా అధ్యక్షుడు, అంజుమాన్‌ కమిటీ అధ్యక్షుడు హెచ్‌ఎన్‌ఎఫ్‌ ఇమాం చేపట్టారన్నారు. కర్ణాటక హజ్‌ శిక్షణా వేదిక యాత్రలను నిర్వహించడం, మార్గనిర్దేశం చేయడం అభినందనీయం అన్నారు. అన్ని మతాల సారాంశం ఒకటే, అదే మానవ సూత్రం. అందరితో కలిసి జీవించడం నిజమైన మానవుని లక్షణం అన్నారు. మన నైతికంగా భిన్నంగా ఉండవచ్చు, కానీ మనందరం మనుషులం అని అన్నారు. నేను అన్ని కులాలు, మతాలకు ప్రతినిధిని అన్నారు. నాకు అందరూ సమానమే అయినా ఎవరికీ అన్యాయం జరగకుండా అందరికీ సేవలు అందిస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర హజ్‌ కమిటీ చైర్మన్‌ జుల్ఫికర్‌ అహ్మద్‌ ఖాన్‌ (టిప్పు) మాట్లాడుతూ ప్రభుత్వం హజ్‌ యాత్రికులకు సహాయం అందిస్తోందన్నారు. ముస్లిం సోదరులు ప్రభుత్వం అందించే విద్యా, ఆర్థిక సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని యాత్రను విజయవంతంగా పూర్తి చేయాలన్నారు. బళ్లారి, విజయనగర, చిత్రదుర్గ, కొప్పళ, గదగ, బాగలకోటె జిల్లాల నుంచి 639 మంది యాత్రికులు వచ్చారన్నారు. వచ్చిన యాత్రికులకు శిక్షణ ఇచ్చి హజ్‌ యాత్రకు పంపుతామన్నారు.

మానవత, దానగుణంతో జీవించాలి 1
1/1

మానవత, దానగుణంతో జీవించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement