బనశంకరి: అంతరించిపోతున్న జీవ జాతుల దినోత్సవం సందర్భంగా ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆన్ నేచర్ (ఐయుసీఎన్), సిటీస్ సంస్థలు వన్యప్రాణులు, మొక్కల వ్యాపారాన్ని నియంత్రించడానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి. పలురకాల జాతుల పక్షులు, ప్రాణులు, చెట్లను రక్షించడానికి రెండు సంస్థలూ కృషిచేస్తాయి. మంగళవారం బెంగళూరు కేంద్ర తపాలాఫీసులో జరిగిన కార్యక్రమంలో ప్రవాసాంధ్రుడు, విశ్రాంత ఐఎఫ్‌ఎస్ అధికారి ఎం.లోకేశ్వరరావు రాసిన సిటీస్ అంతరించిపోతున్న జాతులకు చెందిన స్టాంపుల పుస్తకాన్ని పరిసర ప్రేమికురాలు ప్రియావెంకటేశ్, పద్మశ్రీ అవార్డు గ్రహీత సీవీ.రాజు మాస్టర్ క్రాఫ్ట్‌మ్యాన్ విడుదల చేశారు.