బనశంకరి: బెంగళూరు లో మరోసారి లవ్ జిహాద్ వ్యవహారం బయటపడింది. ఎలక్ట్రానిక్ సిటీలోని ప్రముఖ ఐటీ కంపెనీ ఉద్యోగిని లోబర్చుకుని లవ్‌జిహాద్‌కు యత్నించిన ఆరోపణలపై కశ్మీరుకు చెందిన యువకుడిపై హెబ్బగోడి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. వివరాలు... సదరు యువకుడు మోజీప్ అష్రఫ్ బేగ్ , బాధితురాలు నగరంలో ఒకే ఐటీ కంపెనీలో పనిచేస్తున్నారు. ఇద్దరు ప్రేమలో పడ్డారు. వివాహానికి ముందే శారీరకంగా ఒక్కటయ్యారు. ముస్లిం అయినప్పటికీ ఎలాంటి మత కట్టుబాట్లులేవని కోర్టులోనే వివాహం చేసుకుందామని యువతికి హామీ ఇచ్చి 2019 నుంచి శికారిపాళ్యలో ఇల్లు తీసుకుని సహజీవనం చేయసాగారు. అయితే వివాహం చేసుకోవాలని యువతి కోరగానే అతని నిజస్వరూపం వెలుగుచూసింది. ముస్లిం మతంలోకి మారాలని ఆమెను ఒత్తిడి చేశాడు.
ఈనెల 6న యువతి.. నేను లవ్‌జిహాద్‌లో చిక్కుకున్నానని, దయచేసి ఆ యువకుడి నుంచి కాపాడాలని ప్రధాని మోదీకి లేఖ రాసింది. తనకు అత్యవసరంగా పోలీసు సహాయం కావాలని కోరింది. టెక్కీ యువతి ట్విట్టర్‌లో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో బెల్లందూరు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. అతని కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. హెబ్బగోడి పోలీసుల బృందం కశ్మీర్‌కు కూడా వెళ్లింది.
ఢిల్లీకి పయనమైన కుమార
దొడ్డబళ్లాపురం: రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు గురించి చర్చించేందుకు జేడీఎస్ అగ్రనేత హెచ్‌డీ కుమారస్వామి గురువారం ఉదయం ఢిల్లీకి వెళ్లారు. కుమారుడు నిఖిల్ కూడా ఆయన వెంట ఉన్నారు. అంతకుముందు మీడియాతో మాట్లాడుతూ సాయంత్రం పలువురు బీజేపీ నేతలతో భేటీ అవుతానని, ఉందని, అందులో పొత్తు విషయం గురించి చర్చిస్తామన్నారు. సీట్ల సర్దుబాటు గురించి ఇంకా ఎలాంటి చర్చలూ జరగలేదన్నారు. 28 లోక్‌సభ స్థానాల్లో ప్రస్తుత పరిస్థితి, గత ఎన్నికల ఫలితాలు ఇవన్నీ చూసుకుని ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు. బీజేపీతో పొత్తు కుదిరినట్టేనా అన్న ప్రశ్నకు చూద్దామంటూ దాటవేసారు.