
మాట్లాడుతున్న నీలకంఠప్ప తదితరులు
బళ్లారిటౌన్: జనతా బజార్ ముందు భాగంలోని కాంప్లెక్స్ లీజ్ రద్దుకు సహకార సంఘాల అధికారి డాక్టర్ రాజేంద్ర ఆదేశించినందున లీజును రద్దు చేస్తున్నట్లు జనతా బజార్ అధ్యక్షుడు జీ.నీలకంఠప్ప, జనరల్ మేనేజర్ షాకీరబాను తెలిపారు. గురువారం సంఘం కార్యాలయంలో విలేకరులతో వారు మాట్లాడుతూ 2009లో పోలా విక్రమ్ లక్ష్మీ అసోసియేషన్స్ 30 ఏళ్ల లీజ్‌కు ఇచ్చారని, అయితే ఇంతవరకు అగ్రిమెంట్ కాలేదన్నారు. ఈ స్థలాన్ని వారు సబ్ లీజ్‌కు ఇతరులకు ఇస్తున్నారన్నారు. అయితే ఇంతవరకు నోటీసులు ఇస్తున్న వారు అగ్రిమెంట్ చేసుకోక పోవడంతో లీజ్‌ను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. జనతాబజార్ 2.5 ఎకరాల విస్తీర్ణంలో ఉందని, దీన్ని సంవత్సరానికి రూ.36 లక్షల బాడుగకు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 23న జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమావేశంలో డైరెక్టర్లు వెంకటేష్ హెగ్డె, వెంకటస్వామి, కాత్యాయిని మైత్రి, విజయ్‌కుమార్ గౌడ, నరేష్‌కుమార్‌లు పాల్గొన్నారు.
వాక్‌మేట్ అంబాసిడర్‌గా నయనతార
సాక్షి, బెంగళూరు: ప్రముఖ ఫుట్‌వేర్ బ్రాండ్ వాక్‌మేట్ సంస్థ ప్రచారకర్తగా ప్రముఖ నటి నయనతార వ్యవహరిస్తారు. ఈ విషయాన్ని సంస్థ ఎండీ బాస్టిన్ జోసెఫ్ వెల్లడించారు. నయనతార ఎంపిక ద్వారా మరింతగా వినియోగదారులకు చేరువవుతామని ఆయన ఒక పత్రికా ప్రకటనలో ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే వివిధ భాషల్లో నయనతార ద్వారా యాడ్ షూటింగ్‌ను పూర్తి చేసినట్లు వెల్లడించారు. నయనతార ద్వారా ‘వాక్‌మేట్ వాక్ విత్ కంఫర్ట్’ అనే మార్కెటింగ్ ప్రచారాన్ని చేయబోతున్నట్లు తెలిపారు.
హిందీని ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి
రాయచూరు రూరల్: జాతీయ భాష హిందీని ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని రిటైర్ట్ ప్రిన్సిపాల్ ప్రభాకర్ అన్నారు. ఆయన గురువారం సోమసుభద్రమ్మ రామనగౌడ మహిళా కళాశాలలో ఏర్పాటు చేసిన హిందీ దివస్‌ను ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలో కన్నడ భాషకు ప్రాధాన్యత ఇస్తూనే హిందీని కూడా మాట్లాడాలన్నారు. 1949లో అధికారికంగా గుర్తింపు పొందిందన్నారు. సమావేశంలో ప్రిన్సిపాల్ అమరేగౌడ, వెంకటేష్, శ్యాం, హిందీ భాషా ప్రొఫెసర్ డాక్టర్ అరుణ, సురేష్, రాజేంద్ర, దేవిరెడ్డి, గిరిజాలున్నారు.


కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న దృశ్యం