●సీఎం ఇబ్రహీం ఆరోపణ
మాలూరు : రాష్ట్రంలో చట్టాలపై అవగాహన లేకుండా పాలన సాగిస్తున్న బీజేపీ ప్రభుత్వం వివిధ సముదాయాలను ప్రలోభ పెట్టే ఉద్దేశంతో రాజకీయ లబ్ధి కోసం రిజర్వేషన్ సౌకర్యాన్ని అందించిందని జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సీఎం ఇబ్రహీం ఎద్దేవా చేశారు. మంగళవారం పట్టణంలోని మాలూరు–కోలారు మెయిన్ రోడ్డులోని సర్కస్ మైదానంలో నిర్వహించిన తాలూకా జేడీఎస్ యువ మహిళా సమావేశంలో ఆయన మాట్లాడారు. రిజర్వేషన్ సౌకర్యంలో బంజారా, ముస్లిం సముదాయానికి తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు. ఈ సందర్భంగా జేడీఎస్ యువ రాష్ట్ర అధ్యక్షుడు నిఖిల్ కుమారస్వామి, ఎమ్మెల్సీ ఇంచర గోవిందరాజులు, మాలూరు జేడీఎస్ అభ్యర్థి జీఈ రామేగౌడ తదితరులు పాల్గొన్నారు.