
హోసూరులో నాయకుల సంబరాలు
హోసూరు, కెలమంగలం: అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా యడపాడి పళణీస్వామి కొనసాగవచ్చని కోర్టు తీర్పునివ్వడంతో అన్నాడీఎంకే నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. హోసూరు పట్టణంలోని అన్నాడీఎంకే పార్టీ కార్యాలయం వద్ద క్రిష్ణగిరి పశ్చిమ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి పి. బాలక్రిష్ణారెడ్డి అధ్యక్షతన టపాకాయలు పేల్చి అందరికీ స్వీట్లు పంచి సంబరాలు జరుపుకొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపకార్యదర్శి మదన్, చిట్టిజగదీష్, రాము, నారాయణన్, శ్రీనివాసన్, హరీష్‌రెడ్డి, అశోక్‌రెడ్డి, మంజు, రాజు, వాసుదేవన్, శ్రీధర్, లక్ష్మీహేమకుమార్, కుబేరన్, శంకర్, శిల్పశివకుమార్, దిల్‌షాత్ రహమాన్, శివరామ్, నవీన్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొని సంబరాలు జరుపుకొన్నారు. బాగలూరులో జిల్లా కౌన్సిలర్ ఆర్.కే. రవికుమార్ అధ్యక్షతన టపాకాయలు పేల్చి అందరికీ స్వీట్లు పంచిపెట్టి సంబరాలు జరుపుకొన్నారు. డెంకణీకోటలో మాజీ పట్టణ పంచాయతీ అధ్యక్షుడు నాగేష్ అధ్యక్షతన అందరికీ స్వీట్లు పంచిపెట్టారు.