కరీంనగర్‌స్పోర్ట్స్: జిల్లా అథ్లెటిక్ సంఘం ఆధ్వర్యంలో శనివారం కరీంనగర్‌లోని ప్రాంతీయ క్రీడా పాఠశాలలో జిల్లాస్థాయి ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించారు. 50మందికిపైగా క్రీడాకారులు హాజరైనట్లు జిల్లా అథ్లెటిక్ సంఘం అధ్యక్షుడు నందెల్లి మహిపాల్ తెలిపారు. క్రీడాకారులకు రన్స్, జంప్స్, త్రోస్ అంశాల్లో పోటీలు నిర్వహించారు. రాణించిన క్రీడాకారులను ఈ నెల 11, 12 తేదీల్లో హన్మకొండలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. సంఘం బాధ్యులు రాజగోపాల్, రమేశ్, హరికిషన్, చంద్రశేఖర్, సుమన్ పాల్గొన్నారు.


