17న హౌసింగ్‌బోర్డు స్థలాల వేలం
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలోని హౌసింగ్‌బోర్డు స్థలాలను వేలం వేయడానికి రంగం సిద్ధమైంది. ఈ నెల 17వ తేదీన నగరంలోని హౌసింగ్‌బోర్డుకాలనీలో ఉన్న రెండు స్థలాలను కూడా వేలం వేస్తున్నారు. కాలనీలోని రోడ్ నంబర్ 1లోని 4,235 చదరపు గజాల కమర్షియల్ స్థలంతో పాటు, బైపాస్ ప్రక్కనున్న మరో స్థలాన్ని (గతంలో పోస్టాఫీస్‌కు కేటాయించిన) వేలం వేస్తున్నారు. ఈ నెల 17వ తేదీన మధ్యాహ్నం 1 గంట నుంచి 2.30 గంటల మధ్య ఈ–యాక్షన్ ద్వారా విక్రయిస్తున్నట్లు ఆయా స్థలాల వద్ద హౌసింగ్‌బోర్డు అధికారులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
కాలనీ అవసరాలకే వదిలేయాలి
హౌసింగ్‌బోర్డుకాలనీలోని రెండు స్థలాలను వేలం వేయాలని హౌసింగ్‌బోర్డు విభాగం తీసుకున్న నిర్ణయంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కాలనీ ఏర్పాటు చేసినప్పుడు లేఅవుట్ ప్రకారం ఆయా స్థలాలను నిర్ణీత అవసరాలకు కేటాయించి, వదిలేశారన్నారు. ఇన్ని సంవత్సరాల తరువాత ఆ స్థలాలను వేలం వేస్తుండడం సరికాదని, ఆ స్థలాలు కాలనీ అవసరాలకు వినియోగించాలని కోరుతున్నారు.
కొత్తపల్లి(కరీంనగర్): విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి పోరాటం కొనసాగుతుందని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ 1104 డిస్కం కార్యదర్శి సల్వాజి వేంకటరమణారావు తెలిపారు. కరీంనగర్‌లోని ఓ ఫంక్షన్‌హాల్‌లో సోమవారం టీఈఈయూ 1104 కరీంనగర్ టౌన్, రూరల్, సిటీ సర్కిల్ డివిజన్ల సర్వసభ్య సమావేశం నిర్వహించి నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నా రు. ప్రాంతీయ అధ్యక్ష, కార్యదర్శులు మహేందర్ రావు, రంగు వెంకటనారాయణ, ప్రాంతీయ కార్య నిర్వహక అధ్యక్షుడు రాములు, అదనపు కార్యదర్శి నర్సింగ రావు, జగిత్యాల ప్రాంతీయ అధ్యక్షుడు చేరాలు, జిల్లా, డివిజన్ నాయకులు పాల్గొన్నారు. కరీంనగర్ టౌన్ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులుగా డి.దేవరాజ్, మల్లేశం, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా జయకుమార్, అదనపు కార్యదర్శిగా బాపురెడ్డి, కరీంనగర్ రూరల్ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులుగా కె.శ్రీనివాస్, ఎస్,రవీందర్, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా శంకర్. అదనపు కార్యదర్శిగా ఆర్.తిరుపతి, సిటీ సర్కిల్ అధ్యక్ష, కార్యదర్శులుగా శంషోద్దీన్, కె.శ్రీనివాస్, కార్యనిర్వాహక అధ్యక్షుడుగా సాంబమూర్తి, అదనపు కార్యదర్శిగా చంద్రశేఖర్‌ను ఎన్నుకున్నారు.
ఇన్‌చార్జి డీఈవోగా అశ్వినీ తానాజీ వాకడే
సప్తగిరికాలనీ(కరీంనగర్): జిల్లా ఇన్‌చార్జి డీఈవోగా అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడేను నియమిస్తూ సోమవారం విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశా రు. ఎఫ్‌ఏసీ హోదాలో జిల్లా విద్యాశాఖ అధికా రిగా కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
నగరంలో నేడు పవర్ కట్ ప్రాంతాలు
కొత్తపల్లి: 132 కె.వీ.విద్యుత్ లైన్ల పునర్మిర్మాణ పనులు కొనసాగుతున్నందున మంగళవారం ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెడ్డి ఫంక్షన్‌హాల్, తేజ స్కూల్, ఎస్‌ఆర్ జూనియర్ కళాశాల, సరస్వతీనగర్, వడ్లకాల నీ, చంద్రాపురికాలనీ, రెవెన్యూ కాలనీ, ఆర్టీసీ కాలనీ, హనుమాన్‌నగర్, అమ్మగుడి, తీగలగుట్టపల్లి ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్ 1,రూరల్ ఏడీఈలు పంజాల శ్రీని వాస్‌గౌడ్, గాదం రఘు, తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 11 కె.వీ.రాంనగర్, గీతాభవన్ ఫీడర్ల పరిధిలోని మార్క్‌ఫెడ్, పారమిత స్కూల్, పద్మనగర్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్ 2 ఏడీఈ ఎం.లావణ్య పేర్కొన్నారు.
జమ్మికుంట: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో క్వింటాల్ పత్తి గరిష్టంగా రూ.7,300 పలికింది. సోమవారం మార్కెట్‌కు 68 వాహనాల్లో 546 క్వింటాళ్ల పత్తిని రైతులు అమ్మకానికి తెచ్చారు. మోడల్ ధర రూ.7,100, కనిష్ట ధర రూ.6,500కు ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేశారు. క్రయ విక్రయాలను మార్కెట్ చైర్‌పర్సన్ పూల్లూరి స్వప్న, ఇన్‌చార్జి కార్యదర్శి రాజా పర్యవేక్షించారు.


