రెండు దశాబ్దాల క్రితం ఏర్పాటు | - | Sakshi
Sakshi News home page

రెండు దశాబ్దాల క్రితం ఏర్పాటు

Oct 31 2025 8:00 AM | Updated on Oct 31 2025 8:00 AM

రెండు దశాబ్దాల క్రితం ఏర్పాటు

రెండు దశాబ్దాల క్రితం ఏర్పాటు

రెండు దశాబ్దాల క్రితం ఏర్పాటు పట్టించుకోని ఉన్నతాధికారులు

● స్థానిక ఇందిరాప్రియదర్శినీ కాలనీలో ఎక్కువగా కూలీ పని చేసుకునే కుటుంబాలు ఉంటాయి.

● వాటిని దృష్టిలో పెట్టుకుని రెండు దశాబ్దాల క్రితం పాఠశాలను ఏర్పాటు చేశారు.

● ప్రారంభంలో పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 175కి పైగా ఉండేది.

● తర్వాత సంఖ్య తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం కేవలం 32 మంది మాత్రమే ఉండడం గమనార్హం.

● సమీపంలో ఏళ్ల క్రితమే మరో ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు కావడంతోపాటు.. ఈ పాఠశాలలో నెలకొన్న సమస్యలు కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

● ప్రహరీ లేక పొంచి ఉన్న ప్రమాదం

● పాఠశాల చుట్టూ ప్రహరీ లేకపోవడంతోనే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయనే విమర్శలు ఉన్నాయి.

● ముఖ్యంగా పాఠశాల పక్కనే చెరువు, పంట పొలాలు ఉండడంతో అందులోనుంచి విష సర్పాలు పరిసరాల్లోకి వస్తున్నాయి. దీనివల్ల పాఠశాలకు పిల్లలను పంపడానికి తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు.

● ఈ కారణంగా కొందరు తమ పిల్లలను పాఠశాల నుంచి తీసి మరో పాఠశాలలో చేర్పించినట్లు తెలిసింది.

● రాత్రిపూట మందుబాబులు పాఠశాలకు వచ్చి అక్కడి వరండాల్లో కూర్చుని మద్యం సేవిస్తున్నారు. అక్కడే సీసాలను పగులగొట్టడం, మూత్ర విసర్జన చేయడం వంటివి చేస్తుండడం ఇబ్బందిగా మారింది.

● మెట్‌పల్లి మండలంలోని పెద్దాపూర్‌ గురుకులంలో కొన్ని నెలల క్రితం ఒక విద్యార్థి మృతి చెందడంతోపాటు పలువురు అస్వస్థతకు గురయ్యారు. వీటికి పాము కాట్లు కారణమనే ప్రచారం జరిగింది.

● ప్రస్తుతం ఇందిరా ప్రియదర్శినీ కాలనీ పాఠశాలలో పాముల భయం నెలకొంది. అయినా ఉన్నతాధికారులు పాఠశాలను సందర్శించి తగు చర్యలు తీసుకునే విషయంలో నిర్లక్ష్యం చూపుతున్నారు.

● ఏదైనా ప్రమాదం జరిగితేనే అధికార యంత్రాంగంలో చలనం వస్తోందే తప్ప.. అప్పటి వరకు సమస్యలు తమ దృష్టికి వచ్చినప్పటికీ పట్టించుకోరనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

● ప్రహరీ నిర్మాణం కోసం అవసరమైన నిధులను మంజూరు చేయాలని ఇప్పటికే స్థానిక విద్యా శాఖ సిబ్బంది పలుమార్లు ప్రతిపాదనలు పంపారు. అవి బుట్టదాఖలవుతున్నాయనే కానీ..సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు.

ఆవరణలో సంచరిస్తున్న పాము

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement