● అశాసీ్త్రయమంటూ హైకోర్టులో పిటిషన్ ● మూడు వారాల్లో కౌ
డివిజన్ల డీలిమిటేషన్‌పై నీలినీడలు
కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలకసంస్థ డివిజ న్ల పునర్విభజనపై నీలినీడలు కమ్ముకున్నాయి. అధికారులు చేపట్టిన డివిజన్ల పునర్విభజన అశాసీ్త్రయంగా ఉందంటూ సామాజిక కార్యకర్త మహమ్మద్ అమీర్ హైకోర్టును ఆశ్రయించారు. విచారణకు స్వీకరించిన కోర్టు, మూడు వారా ల్లో కౌంటర్ దాఖలు చేయాలని నగరపాలకసంస్థ అధికారులను ఆదేశించింది.
జూన్‌లో పునర్విభజన
ఈ ఏడాది జనవరిలో పాలకవర్గం పదవీకాలం ముగియడంతో మల్కాపూర్, లక్ష్మిపూర్, చింతకుంట, బొమ్మకల్, దుర్శేడ్, గోపాల్‌పూర్ గ్రా మాలతో పాటు కొత్తపల్లి మున్సిపాల్టీని నగరపాలకసంస్థలో విలీనం చేశారు. 60 డివిజన్లు ఉన్న నగరాన్ని 66 డివిజన్లకు మార్చారు.
అశాసీ్త్రయంపై హైకోర్టుకు
పునర్విభజన అశాసీ్త్రయంగా ఉందంటూ సామాజిక కార్యకర్త మహమ్మద్ అమీర్ హైకోర్టును ఆశ్రయించారు. పాత 24వ డివిజన్‌ను ముసాయిదాలో 48, గెజిట్‌లో 27వ డివిజన్‌గా, పాత 2వ డివిజన్‌ను ముసాయిదాలో 2, గెజిట్‌లో 3వ డివిజన్‌గా మార్చారు. ముందుగా 48వ డివిజన్‌లో 6–6–579 నుంచి 6–6–1078 వరకు, 6–4–107 నుంచి 6–4–194 వరకు ఇళ్లను చేర్చారు. 6–4–107 నుంచి 6–4–201/1 వరకు ఇళ్లను ఇదే డివిజన్‌లో చేర్చాలంటూ అమీర్ అప్పట్లో అధికారులకు అభ్యంతరం తెలిపారు. 6–4–107 నుంచి 6–4–201/1 ఇళ్లను 27వ (ముసాయిదాలో 48)డివిజన్‌లో చేర్చారు. అంబేడ్కర్ నగర్‌లో అంతర్భాగంగా ఉన్న 6–6–1013 నుంచి 6–6–1078 వరకు ఇండ్లను 27వ డివిజన్‌లో కాకుండా, పక్కనున్న 3వ డివిజన్ తీగలగుట్టపల్లిలో కలపడం సమస్యగా మారింది. 3వ డివిజన్‌లో అశాసీ్త్రయంగా కలిపిన ఇళ్లను యథావిధిగా 27వ డివిజన్‌లోనే ఉంచాలని అమీర్ డిమాండ్ చేస్తున్నారు.
పక్క నియోజకవర్గ వ్యక్తి ఓటు వేయొచ్చా?
‘ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతోంది. ఈ పోలింగ్‌లో పక్క నియోజకవర్గం నుంచి ఓటరు వచ్చి ఇక్కడ ఓటు వేయోచ్చా’ అంటూ కరీంనగర్ పునర్విభజన కేసు విచారణ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఒక డివిజన్‌లో ఉన్న ఇళ్లను సంబంధం లేకుండా పక్క డివిజన్‌లో ఎలా వేశారని, దీనిపై మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని నగరపాలకసంస్థ అధికారులను కోర్టు ఆదేశించినట్లు పిటిషనర్ తెలిపారు. దీంతో డివిజన్ల డీలిమిటేషన్‌పై ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. కోర్టు విచారణ హాట్‌టాపిక్‌గా మారింది.


