రాజన్న సేవలో బాంబే హైకోర్టు జడ్జి | - | Sakshi
Sakshi News home page

రాజన్న సేవలో బాంబే హైకోర్టు జడ్జి

Oct 31 2025 8:10 AM | Updated on Oct 31 2025 8:10 AM

రాజన్

రాజన్న సేవలో బాంబే హైకోర్టు జడ్జి

● చికిత్స పొందుతూ తల్లి మృతి

వేములవాడఅర్బన్‌: రాజన్న అనుబంధ భీమేశ్వరస్వామి వారిని బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ నందేశ్‌ ఎస్‌.దేశ్‌పాండే కుటుంబ సమేతంగా గురువారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆశీర్వచనం అందజేసి, స్వామివారి వస్త్రం కప్పి లడ్డూ ప్రసాదం అందజేశారు.

బహ్రెయిన్‌లోనే శ్రీపాద నరేశ్‌ అంత్యక్రియలు..?

మెట్‌పల్లి: ఉపాధి నిమిత్తం బహ్రెయిన్‌ దేశానికి వెళ్లిన పట్టణంలోని రాంనగర్‌కు చెందిన శ్రీపాద నరేశ్‌(39) మృతదేహానికి అక్కడే అంత్యక్రియలు నిర్వహించడానికి అతని కుటుంబ సభ్యుల సమ్మతిని భారత ఎంబసీ కోరింది. 2020 మే 28న అక్కడి ఆసుపత్రిలో నరేష్‌ అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ మరణించాడు. అప్పటి నుంచి అక్కడి మార్చురీలోనే అతని మృతదేహాన్ని భద్రపర్చిన సంగతి తెలిసిందే. ఇటీవల ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో వారు మృతదేహాన్ని అక్కడి నుంచి రప్పించి తమకు అప్పగించాలని 21న హైదరాబాద్‌లోని సీఎం ప్రవాసీ ప్రజావాణిని ఆశ్రయించారు. రాష్ట్ర అధికారులు అక్కడ భారత ఎంబసీని ఆరా తీయగా.. చనిపోయి చాలాకాలం అయినందున మృతదేహం తరలించడానికి అనుకూలంగా లేదని, ఈ క్రమంలో ఇక్కడే అంత్యక్రియలు జరిపేలా కుటుంబ సభ్యులు తమ సమ్మతిని తెలియజేయాలని కోరారు. దీనికి సానుకూలంగా ఉన్న వారు అంత్యక్రియలకు నరేశ్‌ సోదరుడు ఆనంద్‌ను పంపాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అక్కడకు వెళ్లే ఆర్థిక స్తోమత లేకపోవడంతో ప్రభుత్వం, ప్రవాసీ సంఘాల సాయం కోరుతున్నాడు.

తల్లీకొడుకుపై గొడ్డలితో దాడి

శంకరపట్నం(మానకొండూర్‌): కరీంనగర్‌ జిల్లాలోని కరీంపేట గ్రామంలో గురువారం తల్లీకొడుకుపై పలువురు గొడ్డలితో దాడి చేయగా.. తల్లి చికిత్స పొందుతూ మృతిచెందింది. కరీంపేట గ్రామానికి చెందిన గడ్డం రాజుకు భార్య రేణుకతో కొంతకాలంగా విభేదాలున్నాయి. ఇంట్లోకి భర్త రాజు, అత్త మల్లమ్మ రానివ్వడం లేదని రేణుక పుట్టింటివారు గొడవ పడ్డారు. మల్లమ్మ(65), రాజు(36)పై గొడ్డలితో దాడి చేశారు. మల్లమ్మ చేతి వేళ్లు నరకడంతో తీవ్ర రక్తస్రావమైంది. స్థానికులు పోలీసులకు సమాచారమందించడంతో.. హుజూరాబాద్‌ రూరల్‌ సీఐ వెంకటి ఘటనాస్థలానికి చేరుకొని ప్రైవేట్‌ వాహనంలో కరీంనగర్‌ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మల్లమ్మ మరణించినట్లు పోలీసులు తెలిపారు.

ఏఎల్పీలో కార్మికుడికి అస్వస్థత

రామగిరి(మంథని): ఏపీఏ గనిలో గురువారం పీ షిప్ట్‌లో సింగరేణి కార్మికుడు తోట రవి అస్వస్థతకు గురయ్యాడు. విధుల్లో భాగంగా 86 లెవల్‌ వద్ద అస్వస్థతకు గురి కాగా గమనించిన తోటి కార్మికులు అధికారులకు సమాచారం అందించారు. అనంతరం సెంటినరికాలనీ డీస్పెన్సరీకి తీసుకెళ్లగా, మెరుగైన చికిత్స కోసం గోదావరిఖని ఏరియా ఆసుపత్రికి తరలించారు. గనిలో రక్షణ చర్యలు మెరుగుపరచాలని కార్మికులు కోరుతున్నారు.

రాజన్న సేవలో బాంబే హైకోర్టు జడ్జి
1
1/3

రాజన్న సేవలో బాంబే హైకోర్టు జడ్జి

రాజన్న సేవలో బాంబే హైకోర్టు జడ్జి
2
2/3

రాజన్న సేవలో బాంబే హైకోర్టు జడ్జి

రాజన్న సేవలో బాంబే హైకోర్టు జడ్జి
3
3/3

రాజన్న సేవలో బాంబే హైకోర్టు జడ్జి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement