 
															మానేరు వాగులో వ్యక్తి అదృశ్యం
తంగళ్లపల్లి(సిరిసిల్ల): తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన చల్లంగుల కృష్ణయ్య(60) అనే వ్యక్తి గురువారం మానేరువాగులో దూకి అదృశ్యమయ్యాడు. ఎస్సై ఉపేంద్రచారి తెలిపిన వివరాలు. కృష్ణ కూలి పనులు చేసుకునేవాడు. ఇటీవల కంటికి ఆపరేషన్ జరిగింది. ఆరోగ్యం సరిగా లేకపోగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడు. ఈక్రమంలోనే గురువారం ఉదయం ఆస్పత్రికి వెళ్తున్నాని చెప్పి బయటకు వచ్చిన కృష్ణయ్య సాయంత్రం మానేరువాగులో దూకాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో గాలింపు చేపట్టగా ఆచూకీ లభించలేదు. కృష్ణయ్య కొడుకు లక్ష్మీనారాయణ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
గజ ఈతగాళ్లతో గాలింపు చేపడతాం
కృష్ణయ్య అదృశ్యంపై గాలింపు చర్యలు చేపట్టగా చీకటి పడినా ఆచూకీ లభించలేదని తహసీల్దార్ జయంత్ ప్రకటనలో తెలిపారు. చీకటి పడడంతో గాలింపు చర్యలు నిలిపివేశామని, శుక్రవారం తెల్లవారుజాము నుంచి గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపడతామని తెలిపారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
