మోంథా బీభత్సం ● నేలవాలిన వరి, మొక్కజొన్న ● కల్లంలో నీళ్
సాక్షిప్రతినిధి, కరీంనగర్:
నాలుగు నెలల రైతుల కష్టం నాలుగు గంటల్లోనే వర్షార్పణమైంది. ఎండనక, వాననక కష్టపడి పంటను కాపాడుకుంటూ వస్తే.. మోంథా తుపాన్ నిండా ముంచింది. పడిన కష్టానికి ఫలితం కళ్లముందు కనిపిస్తుండగా.. వరణుడు అన్నదాత ఆశలను గంటల వ్యవధిలో నీటిపాలు చేశాడు. బుధవారం నుంచి గురువారం వేకుజామున వరకు కురిసిన వర్షానికి జిల్లావ్యాప్తంగా వరి పంటకు తీవ్రనష్టం వాటిల్లింది. కల్లాల్లోని ధాన్యం నీటిపాలైంది. కోతకొచ్చిన వరి నేలవాలింది. దూదిరైతుకు దుఃఖాన్ని మిగిల్చగా.. నీటిలో తేలి ఆడుతున్న ధాన్యాన్ని ఆరబెట్టేందుకు రైతులు పొద్దంతా కష్టపడాల్సి వచ్చింది. వర్షం ప్రభావంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతుండగా.. పలుచోట్ల రహదారులు తెగిపోయాయి. పశువులు నీటిలో మునిగి చనిపోగా.. పలు ఇళ్లు దెబ్బతిన్నాయి. ఒక్కసారిగా విరుచుకుపడిన మోంథా తుపాన్ ఎన్నడూ లేని విధంగా జిల్లా రైతులను పుట్టెడు దుఃఖంలో ముంచింది.
ప్రత్యేక విపత్తుగా గుర్తించాలి
ప్రభుత్వ చేయూత అత్యవసరమని రైతులు కోరుతున్నారు. కోలుకోని విధంగా పంటలు దెబ్బ తిన్నాయని, వ్యవసాయశాఖ అధికారుల ప్రాథమిక అంచనా ప్రకారం ఎకరాకు రూ.20 వేలు పరిహారం ఇస్తేనే కొండంత భరోసా అంటున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పలుగా పోయగా రహదారులు, కల్లాల్లో ఆరుబయట ఆరబోశారు. కాగా.. తడిసిన ధాన్యాన్ని తక్షణమే కొనాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
మోంథా బీభత్సం ● నేలవాలిన వరి, మొక్కజొన్న ● కల్లంలో నీళ్
మోంథా బీభత్సం ● నేలవాలిన వరి, మొక్కజొన్న ● కల్లంలో నీళ్
మోంథా బీభత్సం ● నేలవాలిన వరి, మొక్కజొన్న ● కల్లంలో నీళ్


