
అంత్యక్రియలకు వెళ్తూ.. అనంత లోకాలకు..
ఎల్లారెడ్డిపేట/కోనరావుపేట: బంధువుల అంత్యక్రియలకు వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందింది. ఎల్లారెడ్డిపేట మండలంలో జరిగిన ప్రమాదం కోనరావుపేట మండలం సుద్దాలలో విషాదాన్ని నింపింది. ఎల్లారెడ్డిపేట ఎస్సై రాహుల్‌రెడ్డి తెలిపిన వివరాలు. కోనరావుపేట మండలం సుద్దాల గ్రామానికి చెందిన దొబ్బల మరియమ్మ(58) అల్మాస్‌పూర్‌లో బంధువుల ఇంట్లో ఒకరు చనిపోగా బైక్‌పై తన చిన్నకుమారుడు ప్రభాకర్‌తో కలిసి వస్తుంది. ఈక్రమంలో అక్కపల్లి శివారులోని బుగ్గరాజేశ్వరస్వామి ఆలయం వద్ద గల మూలమలుపు వద్ద వాహనం అదుపుతప్పడంతో మరియమ్మ కిందపడింది. తలకు బలమైన గాయాలు కావడంతో ఎల్లారెడ్డిపేటలోని ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాహుల్‌రెడ్డి తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రంలో ఆయాగా పనిచేస్తున్న మరియమ్మ అంత్యక్రియలు సుద్దాలలో గురువారం నిర్వహించనున్నారు.
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి