
ధర్మపురిలో రెండిళ్లలో చోరీ
ధర్మపురి: తాళం వేసి ఉన్న రెండిళ్లలో చోరీకి పాల్పడి నగదు, బంగారం ఎత్తుకెళ్లిన ఘటన ధర్మపురిలో చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన కొరిడె సత్తయ్య జర్మనీలో ఉంటున్న తన కూతురు వద్దకు ఇటీవల వెళ్లాడు. అలాగే ప్రభుత్వ ఉపాధ్యాయుడు నాందేవి దీపావళి సెలవుల కోసం సొంతూరుకు వెళ్లాడు. ఈ రెండిళ్లలో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడ్డారు. నాందేవి బుధవారం ఇంటికి వచ్చి చూడగా తాళాలు పగులగొట్టి ఉన్నాయి. రూ.15వేలు, అర తులం బంగారం, సత్తయ్య ఇంట్లో తులంనర బంగారం, వెండి పత్ర మాయమైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉదయ్‌కుమార్ తెలిపారు.