
తీన్మార్ మల్లన్నపై ఫిర్యాదు
కరీంనగర్‌క్రైం: ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యా ఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకో వాలని బీసీ కుల సంఘాలు, జాగృతి, యునైటెడ్ ఫూలే ఫ్రంట్, మహిళ విభాగాల ఆధ్వర్యంలో సోమవారం నగరంలోని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యా దు చేశారు. బీసీ కుల సంఘాల మహిళ విభాగం జిల్లా అధ్యక్షురాలు కర్రె పావని, నాయకులు గంటల రేణుక, గుబురే సుజాత, పాదం అజాంతా, బీసీ కుల సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్, నాయకులు గొట్టం మహేశ్, పూసాల రణధీర్, మడిపెల్లి వినీత్ ఉన్నారు.