
చూడచక్కని చెక్కపల్లి
వేములవాడరూరల్: పర్యావరణ పరిరక్షణలో ఆ పల్లె ముందుంది. గ్రామస్తులు అంతా ఏకతాటిపైకి వచ్చి ప్లాస్టిక్‌ను నిషేధించాలని ప్రతిన బూనారు. అనుకున్నదే తడవుగా గ్రామంలో ఏ ఫంక్షన్ జరిగినా పేపర్ ప్లేట్లు, ప్లాస్టిక్ గ్లాస్‌లను వినియోగించడం లేదు. స్టీల్ ప్లేట్లు, స్టీల్ గ్లాసులు వాడుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు వేములవాడరూరల్ మండలం చెక్కపల్లి. గ్రామస్తులు పాటిస్తున్న పర్యావరణ పరిరక్షణ చర్యలపై ప్రత్యేక కథనం.
ఓడీఎఫ్ ప్లస్‌లో ముందడుగు
స్వచ్ఛభారత్ మిషన్ గ్రామీణ క్యాంపెయిన్‌లో భాగంగా 2025 ఏప్రిల్ 2న కేంద్ర బృందం గ్రామాన్ని సందర్శించింది. ఈ గ్రామంలో ఇంకుడుగుంతలు, కంపోస్ట్‌షెడ్, స్కూళ్లలో టాయిలెట్స్, సామూహిక ఇంకుడుగుంతలు పరిశీలించారు. ఓడీఎఫ్ ప్లస్ బహిరంగ మలవిసర్జన రహితంగా ఘన, ద్రవ విసర్జన బయటకు కనిపించకుండ, రోడ్డుపై చెత్త వేయకుండా, ఇంకుడుగుంతలతో నీరు బయటకు రాకుండా చేయడంతో ఓడీఎఫ్ ప్లస్‌గా గ్రామాన్ని ఎంపిక చేశారు. చెక్కపల్లిలో 464 గృహాలు ఉండగా 2,320 జనాభా ఉన్నారు. చెత్తను సేంద్రీయ ఎరువుగా తయారు చేసి ఆ గ్రామంలోనే రైతులకు విక్రయించడం ఇప్పటి వరకు గ్రామపంచాయతీకి రూ.6,625 ఆదాయం వచ్చింది. గ్రామంలో ఎవరి ఇంటిలో అయినా శుభకార్యాలు జరిగినప్పుడు పూర్తిగా ప్లాస్టిక్ వస్తువులు వాడకుండా గ్రామస్తులు తీసుకున్న నిర్ణయాలతో యజమాని స్టీల్ వస్తువులను వాడేలా గ్రామపంచాయతీ ఉచితంగా ఇచ్చేందుకు స్టీల్ బ్యాంకును ఏర్పాటు చేశారు. ప్లాస్టిక్ నివారణకు ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేసి కమిటీ ద్వారా గ్రామంలో ఎప్పటికప్పుడు నివారణ చర్యలు చేపడుతున్నారు. ప్రతీ ఇంటితోపాటు గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలైన ప్రైమరీ, హైస్కూళ్లలో కూడా ఈ విధానం ఉండాలని గ్రామస్తులందరూ, కమిటీ సభ్యులు ఇంకుడుగుంతలు నిర్మించారు. గ్రామంలో డ్రెయినేజీ అనేది లేకుండా ప్రతి ఒక్కరు ఇంటివద్ద ఇంకుడుగుంతలనే ఏర్పాటు చేసుకున్నారు. దుకాణాల్లో ప్లాస్టిక్ వాడకుండా పేపర్, క్లాత్ బ్యాగుల అమ్మకాలు కూడా ప్రారంభించారు.
ఉత్తమ గ్రామపంచాయతీగా మూడుసార్లు అవార్డు
రాజన్నసిరిసిల్ల జిల్లాలోనే వేములవాడరూరల్ మండలం చెక్కపల్లిని ఉత్తమ గ్రామపంచాయతీగా 2020, 2021, 2023 సంవత్సరంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జిల్లాలో ఉన్న అన్ని గ్రామపంచాయతీలను పరిశీలించిన జిల్లా అధికారులు ఉత్తమ గ్రామపంచాయతీగా ఎంపిక చేస్తారు. అందులో చెక్కపల్లి గ్రామాన్ని ఆదర్శంగా తీసుకున్న జిల్లా యంత్రాంగం ఈ గ్రామాన్ని ఉత్తమ జీపీగా ఎంపిక చేశారు.
– పర్యావరణ పరిరక్షణలో అగ్రభాగం
– ఓడీఎఫ్ ప్లస్‌లో ముందడుగు
– జిల్లాకే ఆదర్శం ఆ గ్రామం
అందరి సహకారంతోనే
చెక్కపల్లి గ్రామం ఓడీఎఫ్ ప్లస్‌లో ముందుంజలో ఉండి ఉత్తమ గ్రామపంచాయతీగా మూడుసార్లు అవార్డు అందుకోవడంలో గ్రామస్తు ల సహకారం ఉంది. గ్రామ ంలో ప్రతి ఒక్కరి కృషితోనే స్వచ్ఛభారత్, హరి తహారం, ఇంకుడుగుంతలు అందరి సహకారంతోనే విజయవంతమై ఆదర్శంగా నిలిచింది.
– గడ్డం చందన, పంచాయతీ కార్యదర్శి, చెక్కపల్లి

చూడచక్కని చెక్కపల్లి

చూడచక్కని చెక్కపల్లి

చూడచక్కని చెక్కపల్లి

చూడచక్కని చెక్కపల్లి

చూడచక్కని చెక్కపల్లి