
నీట్ ర్యాంకర్లకు అభినందనలు
కరీంనగర్: నీట్ యూజీలో జాతీయస్థాయి, రాష్ట్రస్థాయిలో 2వేల ర్యాంకు సాధించిన గుడికందుల సింధును ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ వి.నరేందర్ రెడ్డి అభినందించారు. ప్రోత్సహించిన సింధు తండ్రి గుడికందుల సత్యంను శాలువాతో సన్మానించారు. సత్యం మాట్లాడుతూ పిల్లలు మరింత ఉన్నతస్థాయిలో ఎదగాలని, తన కూతురు పట్టుదలతో చదివి ర్యాంకులు సాధించినందుకు సంతోషంగా ఉందని తెలిపారు.
కొదురుపాకలో గొర్రెలు చోరీ
బోయినపల్లి(చొప్పదండి): మండలంలోని కొదురుపాక ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో గొర్రెలు చోరీకి గురైనట్లు గొర్రెల కాపర్లు తెలిపారు. స్థానికులు, బాధితులు తెలిపిన వివరాలు. గ్రామానికి చెందిన నలుగురు గొర్రెలకాపర్లు తమ గొర్రెలను శనివారం రాత్రి బీ సైడ్ కాలనీ శివారులో మంద పెట్టుకున్నారు. ఆదివారం తెల్లవారు జామున లేచి చూసేసరికి పెంజర్ల తిరుపతికి చెందిన 21 గొర్రెలు, పెంజర్ల అంజయ్యవి 10, పెంజర్ల ఎల్లయ్యవి 7, మల్యాల బాలయ్యవి 10 గొర్రెలను దొంగలు ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. రెండు గొర్రెలు సమీప ఆలయాల వద్ద గల మురుగుకాలువలో పడ్డట్లు గుర్తించారు. మరో గొర్రె గ్రామ సమీపంలో పడిపోగా, ఇంకో గొర్రె తప్పించుకొని మంద వద్దకు వచ్చినట్లు వివరించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు నమోదు చేసుకున్నారు.