ప్రజాస్వామ్యానికి సంకెళ్లు
కరీంనగర్‌టౌన్: స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎప్పుడూ మరిచిపోలేని రోజు 1975 జూన్ 25 అని, అధికారాన్ని కాపాడుకునేందుకు నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించిందని, ఆమె తీసుకున్న చీకటి నిర్ణయం ఏకంగా 21 నెలల పాటు దేశ ప్రజలకు శాపమైందని మహా రాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు అన్నారు. జిల్లా బీజేపీశాఖ ఆధ్వర్యంలో బుధవా రం స్థానిక ఈఎన్ గార్డెన్స్‌లో ఎమర్జెన్సీ వ్యతిరేక దినం సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా హా జరైన ఆయన మాట్లాడుతూ ఎమర్జెన్సీ అంటే నిర్బంధపు పిడికిలిలో కొన్ని తరాలవరకూ విని పించే మనోరోదన ఉందని తెలిపారు. ప్రధానంగా ఎమర్జెన్సీ కాలంలో మీడియాపై ఇందిరా స ర్కారు, ఆమె తనయుడు సంజయ్ గాంధీ ఉక్కుపాదం మోపారని అన్నారు. బీజేపీ నాయకులు కొప్పు భాష, వై.సునీల్ రావు, డి.శంకర్, బాస సత్యనారాయణ, కన్నెబోయిన ఓదెలు, గుగ్గిలపు రమేశ్, ఇనుకొండ నాగేశ్వర్‌రెడ్డి, బోయినపల్లి ప్రవీణ్‌రావు,తాళ్లపల్లి శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు.
సోమయ్యను పరామర్శించిన సాగర్‌జీ
ఎమర్జెన్సీలో విద్యాసాగర్‌రావుతో పాటు జైలుకు వెళ్లిన సోమయ్యను నగరంలోని మెహెర్‌నగర్‌లోని తన ఇంటికి వెళ్లి సాగర్‌జీ పరామర్శించారు. విద్యాసాగర్‌రావు రచించిన ‘ఉనికి’ అనే పుస్తకాన్ని సోమయ్యకు బహుకరించారు.
అధికారం కోసం ఎమర్జెన్సీ విధించిన ఇందిరాగాంధీ
మాజీ గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్ రావు


